Utekar: లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో విక్కీ కౌశల్ , నేషనల్ క్రష్ రష్మిక మందన్న కలిసి నటించిన ఛావా చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా దీనిని తీశాడు దర్శకుడు.
Chhaava Director Laxman Utekar Apologizes
ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికుల రోజు 14న విడుదలైంది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే ఛావా మూవీ ఏకంగా రూ. 350 కోట్లకు పైగా వసూలు చేసింది. రాబోయే రోజుల్లో రూ. 500 కోట్ల మార్క్ ను కూడా దాటే ఛాన్స్ ఉందని సినీ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇదిలా ఉండగా ఛావా చిత్రానికి సంబంధించి సినిమా విషయంలో గానోజీ, కన్హోజీ వారసులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. తమ వారసత్వాన్ని కించ పరిచేలా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్(Utekar) తీశాడంటూ ఆరోపించారు. అవసరమైతే తాము సినిమాపై కోర్టుకు వెళతామని హెచ్చరించారు. అంతే కాకుండా రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామన్నారు.
దీంతో ఛావా చిత్ర దర్శకుడు గత్యంతరం లేక దిగి వచ్చాడు. ఈ మేరకు వారికి ఫోన్ చేసి క్షమాపణలు చెప్పాడు. ఎక్కడా తాను కావాలని కించ పరిచేలా సన్నివేశాలు తీయలేదని తెలిపాడు. ఒకవేళ మనసు నొప్పిస్తే మన్నించాలని కోరాడు. దీంతో లక్ష్మణ్ ఉటేకర్ ప్రస్తుతం వైరల్ గా మారాడు. చరిత్రను విస్మరించేలా తాను ఎలాంటి గీత దాట లేదని స్పష్టం చేశాడు డైరెక్టర్.
Also Read : Virat Kohli Shocking :కవర్ డ్రైవ్ వల్లే ఫామ్ కోల్పోయా