Chathuram : ఇప్పుడు ఓటీటీల రాజ్యం నడుస్తోంది. ప్రతి శుక్రవారం వెబ్ సీరీస్, సినిమాలు, షార్ట్ ఫిలింలు విడుదలవుతున్నాయి. జనం పెద్ద ఎత్తున థియేటర్ల కంటే ఓటీటీల వైపే మొగ్గు చూపుతున్నారు. బయటకు వెళ్లలేని వాళ్లు వీటిని ప్రిఫర్ చేస్తున్నారు. సూపర్ హిట్ మూవీస్ తో పాటు ఆదరణ , ఆలోచనలు రేకెత్తించే వెబ్ సీరీస్ ను ఆదరిస్తున్నారు.
Chathuram Movie OTT Sensation
దీంతో ఆయా ఓటీటీ సంస్థలు భారీ ధరకు కొనుగోలు చేస్తున్నాయి. ప్రత్యేకించి కంటెంట్ బాగా ఉన్న వాటికి ఎక్కువ రేటింగ్ వస్తోంది. చాలా సినిమాలు, వెబ్ సీరీస్ లు ఆయా సంస్థలకు కాసుల పంట పండించేలా చేస్తున్నాయి.
ఇక ఓటీటీలకు సంబంధించి ఎలాంటి సెన్సార్షిప్ లేక పోవడంతో మితి మీరిన హింస, సెక్సు, రొమాన్స్, ముద్దులు, మర్డర్స్ , మాఫియా, మోసం, గ్యాంబ్లింగ్ , క్రైమ్ , తదితర అంశాలతో ప్రధానంగా తెరకెక్కించే మూవీస్ , వెబ్ సీరీస్ కు ఎక్కువగా ప్రయారిటీ లభిస్తోంది. దీంతో ఓటీటీలు కూడా వీటినే ఎక్కువగా భారీ ధరకు తీసుకుంటున్నాయి.
తాజాగా మలయాళం సినీ ఇండస్ట్రీకి చెందిన చతురం మూవీ దుమ్ము రేపుతోంది. ప్రస్తుతం ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇది పూర్తిగా రొమాంటిక్ కథాంశంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఇటీవల స్ట్రీమింగ్ అయిన మలయాళ మూవీస్ లలో చతురం(Chathuram) టాప్ లో కొనసాగుతుండడం విశేషం. చతురం కథ విషయానికి వస్తే హీరోయిన్ ఓ ముసలోడిని పెళ్లి చేసుకుంటుంది.
తనకు ఇష్టం లేక పోయినా కోరికలు తీర్చుకుంటూ ఉంటాడు. ఇదే సమయంలో ఇంటికి వచ్చిన లాయర్ కన్నేస్తాడు. తన కోరిక తీర్చమంటూ బలవంతం చేస్తాడు. తన సాయంతో ముసలోడిని తోసేస్తుంది. కానీ తను బయట పడతాడు. ముసలోడిని చూసుకునేందుకు ఓ మేల్ నర్స్ వస్తాడు. ఇద్దరి మధ్య బాండింగ్ పెరుగుతుంది. మరోసారి తనను చంపాలని చూస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
Also Read : Kash Patel – Interesting Post :కాశ్ పటేల్ కు లైన్ క్లియర్