పి. వాసు దర్శకత్వంలో సీక్వెల్ గా వస్తున్న చంద్రముఖి-2 చిత్రంపై ఆసక్తి రేపుతోంది. దీనికి కథ కూడా దర్శకుడే రాశారు. సుభాస్కరన్ అల్లి రాజా నిర్మించారు. బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ తో పాటు తమిళ సినీ రంగానికి చెందిన నటుడు, నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్ నటించారు.
ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందించారు. ఆంథోనీ ఎడిట్ చేయగా ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు మనసు దోచుకునేలా ఉన్నాయి. ఈ ఏడాది అత్యున్నతమైన ఆస్కార్ అవార్డు లభించింది. ఆయన అందించిన నాటు నాటు సాంగ్.
చంద్రముఖి -2 చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేసేందుకు రెడీ అయ్యారు మూవీ మేకర్స్. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇప్పటికే విడుదలైన చంద్రముఖి -1 మూవీ రికార్డుల మోత మోగించింది. భారీ కలెక్షన్లు కొల్లగొటింది. ఈ సినిమాలో జ్యోతిక తో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించారు.
సీక్వెల్ లో హీరో, హీరోయిన్లు మారి పోయారు. వారికి బదులు కంగనా రనౌత్ , లారెన్స్ ను తీసుకున్నారు దర్శకుడు వాసు.