Chandrabose : తెలుగు సినిమా రంగంలో అత్యంత జనాదరణ కలిగిన గేయ రచయితలలో చంద్రబోస్ ఒకడు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆయనకు భాష మీద మంచి పట్టుంది. ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు చంద్రబోస్ ను సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆయన తీసిన బొంబాయి ప్రియుడు సినిమా చంద్రబోస్ కు బూస్ట్ ఇచ్చేలా చేసింది. దీనికి సంగీతం అందించింది ఎంఎం కీరవాణి.
Chandrabose Got National Award
తొలి తెలుగు గేయ రచయితగా ఆస్కార్ అవార్డును అందుకుని చరిత్ర సృష్టించాడు చంద్రబోస్(Chandrabose). అంతే కాదు మొదటి భారతీయ లిరిక్ రైటర్ గా నిలిచాడు. తాజాగా జాతీయ స్థాయిలో అవార్డులు ప్రకటించారు. ఇందులో ఉత్తమ పాటల రైటర్ గా ఎంపికయ్యాడు.
కొండపొలం సినిమాకు సంబంధించి ధమ్ ధమా ధమ్ పాటకు ఈ పురస్కారం దక్కింది. ఇందులో అడవి తల్లి గొప్పదనాన్ని, ప్రకృతి పట్ల ఎంత మమకారం కలిగి ఉండాలన్న భావనను ఈ పాటలో ఉండేలా రాశాడు. ఈ పాట విడుదలైన నాటి నుంచి నేటి దాకా అత్యంత జనాదరణ పొందుతోంది. ఇందులో భాగంగా అవార్డుల ఎంపిక కమిటీ చంద్రబోస్ ను ప్రత్యేకంగా ఎంపిక చేసింది.
తన పాటలతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి. తాజాగ బన్నీ నటించిన పుష్ప ది రైజ్ మూవీ జనాదరణ పొందింది. సామి సామి సాంగ్ ఓ సెన్సేషన్ గా నిలిచింది.
Also Read : R Madhavan : మాధవన్ సెన్సేషన్