Chandra Mohan Movies : తెలుగు సినిమా రంగంలో విషాదం అలుముకుంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్(Chandra Mohan) శనివారం కన్ను మూశారు. ఆయనకు 83 ఏళ్లు. 938కి పైగా సినిమాలలో నటించారు. 175 సినిమాలలో హీరోగా చేశారు. మిగతా సినిమాలలో విలక్షణ పాత్రలు పోషించారు. ఆయన సినీ కెరీర్ 1966 నుంచి ప్రారంభమైంది. తొలి చిత్రం రంగుల రాట్నం. ఆనాటి నుంచి నేటి దాకా కూడా నటిస్తూనే ఉన్నారు. ఈ మధ్యనే అనారోగ్యానికి గురయ్యారు. 2005లో అతనొక్కడే చిత్రానికి గాను నంది అవార్డు పొందారు.
Chandra Mohan Movies Total
శ్రీదేవితో పదహారేళ్ల వయసు, జయప్రదతో సిరి సిరి మువ్వ సినిమాలు బిగ్ సక్సెస్ గా నిలిచాయి. శుభోదయం మూవీలో చంద్రమోహన్(Chandra Mohan) నటన అమోఘం. ఇక ఆయన నటించిన సినిమాలలో కొన్ని మీ కోసం. సుఖ దుఃకాలు, బంగారు పిచ్చుక, ఆత్మీయులు, తల్లిదండ్రలుఉ, పెళ్లి కూతురు, బొమ్మా బొరుసా, రామాలయం, కాలం మారింది, మేమూ మనుషులమే, అల్లూరి సీతారామరాజు, ఓ సీత కథ, దేవదాసు, ఇల్లు వాకిలి ఉన్నాయి.
1978లో ప్రాణం ఖరీదు, ఒక చల్లని రాత్రి, తాయారమ్మ బంగారయ్య, దశ తిరిగింది, శంకరా భరణం, మామా అల్లుళ్ల సవాల్ , రాధా కళ్యాణం, రుద్రకాళి, పెళ్లి చేసి చూపిస్తాం, మనిషికో చరిత్ర, ముగ్గురు మిత్రులు, సువర్ణ సుందరి, చందమామ రావే, ఆస్తులు అంతస్తులు, అల్లుడు గారు, ఆదిత్య 369, ఆమె, నిన్నే పెళ్లాడుతా, ఛలో అసెంబ్లీ, పాపే నా ప్రాణం, చెప్పాలని ఉంది, డార్లింగ్ డార్లింగ్, శుభాశీస్సులు, మన్మధుడు, హోలీ, ఫూల్స్ , వర్షం, నేను సైతం, పౌర్ణమి ఉన్నాయి.
వీటితో పాటు దాసన్న, శంభో శివ శంభో, పంచాక్షరి, గల్లీ కుర్రోళ్లు, తూనీగ తూనీగ, జీనియస్ , బన్నీ అండ్ చెర్రీ, ఒక్కడినే , జేమ్స్ బాండ్ , మోసగాళ్లకు మోసగాడు, జెండాపై కపి రాజు, 2 కంట్రీస్ , కోతల రాయుడు సినిమాలలో నటించారు. ఇవన్నీ పేరొందిన చిత్రాలు కావడం విశేషం.
Also Read : Chandra Mohan Condolence : చంద్రమోహన్ మృతి తీరని లోటు