Chandra Mohan : టాలీవుడ్ లో విషాదం అలుముకుంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ శనివారం కన్ను మూశారు. ఆయనకు 83ఏళ్లు. ఎన్నో సినిమాలు గుర్తుండి పోయేలా నటించారు. హీరోగా మొదలై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ముగిసింది.
Chandra Mohan Memories
కే. విశ్వనాథ్, ఎస్పీ బాల సుబ్రమణ్యంతో విడదీయలేని బంధం ఉంది. వాళ్లు తన ముందే వెళ్లి పోవడంతో తట్టుకోలేక పోయారు. కరోనా దెబ్బకు బాలు కన్ను మూస్తే నన్నెందుకు తీసుకు పోలేదంటూ వాపోయాడు. ఇక విశ్వనాథ్ మృతితో రోదించాడు. తట్టుకోలేక పోయాడు. తనకు తండ్రి లాంటి వారంటూ కన్నీటి పర్యంతం అయ్యాడు.
ఆయన తీసిన సిరిసిరిమువ్వ సినిమా బిగ్ సక్సెస్. ఎలాంటి భేషజం లేకుండా ఇచ్చిన పాత్రకు న్యాయం చేయడంలో సక్సెస్ అయ్యాడు చంద్రమోహన్(ChandraMohan). ఆయనకు పాటలు, గజల్స్, సాహిత్యం అంటే ప్రాణం.
తన భార్య కూడా గొప్ప రచయిత్రి. తనకు ఇద్దరు కూతుళ్లు. ఇద్దరూ అమెరికాలో ఉన్నారు.
సినీ రంగాన్ని ఏలిన హీరోయిన్లలో చాలా మంది తనతో నటించిన వారే. వీరిలో శ్రీదేవి, జయప్రద, మంజుల, రాధిక, జయసుధ, ప్రభ, విజయశాంతి, రామేశ్వరి తదితర నటీమణులు ఉన్నారు. ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. గత 2000 నుంచి నేటి వరకు తండ్రి పాత్రలలో నటించి మెప్పించారు. దువ్వాడ జగన్నాథ్ తనకు గొప్ప పేరు తీసుకు వచ్చింది.
Also Read : Chandra Mohan Journy : ముగిసిన చంద్రమోహన్ ప్రస్థానం