Chandra Mohan Journey : తెలుగు సినిమా రంగంలో ఒక శకం ముగిసింది. సినీ దిగ్గజాలుగా పేరు పొందిన కె. విశ్వనాథ్, ఎస్పీ బాలసుబ్రమణ్యం, చంద్రమోహన్(Chandra Mohan), సిరివెన్నెల సీతా రామ శాస్త్రి ఈ లోకాన్ని వీడారు. కానీ చంద్రమోహన్ కు ఎక్కువ అనుబంధం ఉన్నది విశ్వనాథ్, బాలుతోనే. ఇద్దరూ కోల్పోయిన సమయంలో కంటతడి పెట్టారు.
Chandra Mohan Journey Updates
ఒక రకంగా చెప్పాలంటే రోదించారు. తనను ఎందుకు ముందుకు తీసుకు పోలేదంటూ వాపోయాడు చంద్రమోహన్. ఆయనకు 83 ఏళ్లు. 175 సినిమాలలో హీరోగా నటించాడు. మిగతా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందాడు.
రంగులరాట్నం తొలి చిత్రంలో నటించాడు. సహ నాయకుడిగా, కథ నాయకుడిగా, హాస్య నటుడిగా రాణించాడు. ఆయన ప్రేక్షకులకు తీపి గుర్తులను మిగిల్చి వెళ్లాడు. పాటలు, సాహిత్యం, గజల్స్ అంటే ఇష్టం. ఒక రకంగా ఆయన లక్కీ హీరోగా గుర్తింపు పొందాడు చంద్రమోహన్.
సిరిసిరిమువ్వలో జయప్రద, పదహారేళ్ల వయసులో శ్రీదేవి తారా స్థాయికి చేరుకున్నారు. సుఖదుఖాలు , సీతామహాలమ్మి , తదితర సినిమాలు ఉన్నాయి. మంజుల, రాధిక, జయసుధ, ప్రభ, విజయశాంతి, తాళ్లూరి రాజేశ్వరి హీరోయిన్లు తనతో నటించారు. చంద్రమోహన్ భార్య జలంధర. రచయిత్రిగా పేరొందారు.
Also Read : Chandra Mohan : విలక్షణ నటుడు చంద్రమోహన్