Shaitaan: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్(Ajay Devgn), ఆర్ మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘సైతాన్’. వశీకరణకు గురైన తన కూతురిని కాపాడడానికి ప్రయత్నాలు చేస్తున్న తల్లిదండ్రులుగా అజయ్, జ్యోతిక కనిపిస్తున్న ఈ సినిమాకు వికాస్ బెహల్ దర్శకత్వం వహిస్తున్నారు. జియో స్టూడియోస్ సమర్పణలో అజయ్ దేవగన్, జ్యోతి దేశ్‌పాండే, అభిషేక్ పాఠక్ సంయక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను మహాశివరాత్రి కానుకగా మార్చి 08న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గుజరాతీ హారర్ థ్రిల్లర్ ‘వష్’ సినిమాకు రీమేక్ గా వస్తున్న ‘సైతాన్(Shaitaan)’ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. 25 ఏళ్ల తర్వాత జ్యోతిక బాలీవుడ్ లో చేస్తున్న సినిమా ‘సైతాన్’ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ సినిమా సెన్సార్ బోర్డుకు వెళ్ళింది.
Shaitaan Movie Issue
మార్చి 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోయే ఈ సినిమాలో కొన్ని మార్పులు చేయాలంటూ సెన్సార్ బోర్డ్ ఆదేశించింది. ‘సైతాన్’ సినిమా బ్లాక్ మ్యాజిక్ ను సపోర్ట్ చేస్తూ రూపొందించింది కాదంటూ వాయిస్ ఓవర్ తో కూడి డిస్ క్లైమర్ ఇవ్వాలని సెన్సార్ బోర్డు సూచించినట్లు సమాచారం. దీనితోపాటు కొన్ని సన్నివేశాల నిడివి 25 నిమిషాలు తగ్గించాలని… అభ్యంతరకరమైన పదాలను కూడా మార్చాలని సెన్సార్ బోర్డ్ ఆదేశించింది. అయితే సెన్సార్ బోర్డు చెప్పిన మార్పులు చేసిన తరువాత సినిమా రన్ టైమ్ 2:12 గంటలకు తగ్గిపోతుందని చిత్ర యూనిట్ సమాచారం. ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డును సైతం భయపెట్టిన సన్నివేశాలు ఏమున్నాయి ఈ సినిమాలో అనేది ఉత్కంఠగా మారింది.
Also Read : Janhvi Kapoor : పుట్టినరోజు నాడు ప్రియుడితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్..