Shilpa Shetty : అశ్లీల సినిమాల కేసులో శిల్పాశెట్టి భర్త పై రోజు రోజుకు ముదురుతున్న కేసు

రాజ్ కుంద్రా పై గతంలో ఒకసారి ఈడీ అధికారులు దాడులు చేశారు...

Hello Telugu - Shilpa Shetty

Shilpa Shetty : అశ్లీల సినిమాలు నిర్మించి పంపిణీ చేశారనే అభియోగాలు ఎదుర్కొంటున్న నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం (నవంబర్ 29) రాజ్‌కుంద్రా ఇల్లు, కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసింది. అలాగే మనీలాండరింగ్ కేసులోనూ రాజ్ కుంద్రాతో పాటు మరికొందరిపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించి విచారణ జరిపారు. కొద్ది రోజుల క్రితం రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి(Shilpa Shetty) తమ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. తన స్నేహితులను ఆహ్వానించి భారీ పార్టీ ఇచ్చారు. విందులు, వినోదాలు నిర్వహించారు. ఆ తర్వాత దంపతులిద్దరూ టోంగాలో సందర్శనా స్థలాలను చూసి ఆనందించారు. అయితే ఇది జరిగిన కొన్ని రోజులకే ఈడీ అధికారులు మెరుపు దాడులు చేశారు.

Shilpa Shetty Husband Police Case..

రాజ్ కుంద్రా పై గతంలో ఒకసారి ఈడీ అధికారులు దాడులు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో రాజ్‌కుంద్రాకు చెందిన రూ.97.7 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ డిపార్ట్‌మెంట్ జప్తు చేసింది. ఇందులో జుహులో ఒక విలాసవంతమైన ఇల్లు, పూణేలోని ఇల్లు మరియు కొన్ని ఈక్విటీ షేర్లు కూడా ఉన్నాయి. 6600 కోట్ల బిట్‌కాయిన్ స్కామ్‌కు సంబంధించి రాజ్ కుంద్రాపై ఏప్రిల్ నెలలో దాడి జరిగింది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి రాజ్ కుంద్రాపై మరోసారి ఈడీ సోదాలు నిర్వహించింది. కాగా 2017లో, రాజ్ కుంద్రా, అతని సన్నిహితులు కొందరు బిట్‌కాయిన్‌పై భారీ మొత్తంలో పెట్టుబడుల పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. వీటి ద్వారా భారీ మొత్తంలో ఆస్తులు కూడబెట్టారని టాక్. ఈ కేసు విషయమై 2018లో రాజ్‌ కుంద్రా, శిల్పాశెట్టిని పిలిపించి విచారించారు.

ఆతర్వాత 2021లో ముంబై పోలీసులు అశ్లీల చిత్రాలను నిర్మించి పంపిణీ చేసిన కేసులో రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. రాజ్ కుంద్రా ముంబైలో అసభ్యకరమైన సినిమాలు తీస్తూ, వాటిని లండన్‌లోని తన కంపెనీ సర్వర్ నుండి అప్లికేషన్‌లో అప్‌లోడ్ చేస్తున్నాడని అతనిపై అభియోగాలున్నాయి. దీని ద్వారా కుంద్రా రోజూ లక్షల రూపాయలు సంపాదించేవాడని పోలీసుల విచారణలో తేలింది.

Also Read : Samantha : హీరోయిన్ సమంత తండ్రి కన్నుమూత

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com