Ranya Rao : బెంగళూరు – డీజీపీ కూతురు ప్రముఖ నటి రన్యా రావుకు కోలుకోలేని షాక్ తగిలింది. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకొస్తూ డీఆర్ఐ అధికారులకు బెంగళూరు కెంపెగౌడ ఎయిర్ పోర్ట్ లో అడ్డంగా దొరికి పోయింది. ఊచలు లెక్క పెడుతున్న నటి రాన్యా రావుకు ఝలక్ ఇచ్చింది కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ. ఈమేరకు శనివారం కీలక ప్రకటన చేసింది. గోల్డ్ స్మగ్లింగ్ చేయడం అనేది జాతీయ నేరం కిందకు వస్తుందని తెలిపింది. ఇందులో భాగంగా నటి రన్యా రావుపై కేసు నమోదు చేశామని వెల్లడించింది. అధికారికంగా ప్రకటించింది.
Actress Ranya Rao Shocking
ఇదిలా ఉండగా నటి రన్యా రావు(Ranya Rao) గత కొంత కాలం నుంచి దుబాయ్ తో పాటు ఇతర అరబ్ దేశాలు, అమెరికా, తదితర కంట్రీస్ కు వెళ్లి వచ్చిందని పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ విషయం తనే తెలిపిందని డీఆర్ఐ విచారణ బృందం తెలిపింది. ఇదిలా ఉండగా కెంపెగౌడ ఎయిర్ పోర్ట్ లో దుబాయ్ నుంచి ఫ్లైట్ దిగగానే తన వద్ద నుంచి 14.8 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ కడ్డీల రూపంలో ఉన్నాయి. అంతే కాదు లో దుస్తులలో కూడా దాచుకుందని తేలింది. వాటిని కూడా తీసుకున్నారు.
తను కన్నడ చలన చిత్ర పరిశ్రమలో నటిగా గుర్తింపు పొంది. కచ్చా సుదీప్ తో కలిసి రన్యా రావు మాణిక్య అనే చిత్రంలో నటించింది. తన తండ్రి ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ కు ఎండీగా ఉన్నారు.
Also Read : Deepika Padukone Special Attraction :దీపికా పదుకొనేనా మజాకా