Hero Vijay: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావుడి నడుస్తోంది. దీనిలో భాగంగా ఏప్రిల్ 19న పలు రాష్ట్రాల్లో తొలి విడత పోలింగ్ జరిగింది. ఇందులో తమిళనాడు కూడా ఉంది. తమిళ స్టార్ హీరోలందరూ ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దళపతి విజయ్ కూడా స్థానిక నీలాంగరై పోలింగ్ బూత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అయితే విజయ్ వల్ల తమకు ఇబ్బంది కలిగిందని ఓ సామాన్యుడు… హీరో విజయ్ పై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు.
Hero Vijay Case
కోలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్… కొన్ని నెలల క్రితం ‘తమిళ వెట్రి కళగం’ పేరుతో రాజకీయ పార్టీ కూడా పెట్టాడు. ఈ శుక్రవారం తమిళనాడులో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు… రష్యాలో షూటింగ్ బ్రేక్ ఇచ్చి మరీ చెన్నై వచ్చాడు. స్థానిక నీలాంగరై పోలింగ్ బూత్‌కు విజయ్… మందీ మార్భలంతో రావడం చర్చకు దారి తీసింది. విజయ్ తో పాటు ఆయన అనుచరులు, మద్దతుదారులు 200 మందికి పైగా ఒకే సారి పోలింగ్ బూత్‌కు రావడంతో అక్కడ సాధారణ ఓటర్లు ఇబ్బందులకు గురయ్యారు. ఇదే విషయమై ఓ వ్యక్తి… చైన్నె పోలీస్ స్టేషన్‌లో ఫిర్మాదు చేశాడు. దీనితో ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ఆసక్తి రాజకీయవర్గాల్లో నెలకొంది.
Also Read : Nidhhi Agerwal: ప్రేమ వ్యవహారం పక్కనపెట్టి కెరీర్ మీదే దృష్టి అంటోన్న నిధీ అగర్వాల్ !