ఈ మధ్యన సినీ రంగానికి చెందిన సెలిబ్రిటీలు, సాంకేతిక నిపుణులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తుండడం విస్తు పోయేలా చేసింది. ఉన్న పళంగా పాపులారిటీ రావాలని, తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రచారం కావాలని కాంట్రవర్శియల్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ సినీ రంగానికి చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫర్హా ఖాన్ సంచలనంగా మారారు.
తాజాగా ఆమె ఓ షో సందర్బంగా హిందూ పండుగలపై వివాదాదస్ప కామెంట్స్ చేసింది. ఓ రియాల్టీ షో సందర్బంగా పాల్గొన్న ఫర్హా ఖాన్ నోరు జారారు. దీంతో తమ మనోభావాలు పూర్తిగా దెబ్బ తిన్నాయని, వెంటనే ఆమెను అరెస్ట్ చేయాలని కోరుతూ వికాన్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. దీంతో కొరియో గ్రాఫర్ ఫర్హా ఖాన్ పై కేసు నమోదు చేశారు.
ప్రముఖ కొరియో గ్రాఫర్ గానే కాకుండా దర్శకురాలిగా కూడా గుర్తింపు పొందారు ఫర్హా ఖాన్. షో సందర్బంగా హోలీ పండుగ గురించి కామెంట్స్ చేసింది. ఇందులో అవమానకరమైన పదాన్ని వాడారు. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. దీనిపై తాజాగా స్పందించారు కొరియో గ్రాఫర్. తను కావాలని ఎవరినీ కించ పరిచేలా కామెంట్స్ చేయలేదని స్పష్టం చేసింది. మనోభావాలు దెబ్బతింటే మన్నించాలని సూచించారు. మొత్తంగా నోరు జారడం ఎందుకు దానికి వివరణ ఇవ్వడం ఎందుకని అంటున్నారు నెటిజన్స్.