Captain Vijayakanth: ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన విజయకాంత్‌

ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన విజయకాంత్‌

Hello Telugu - Captain Vijayakanth

Captain Vijayakanth: ప్రముఖ సినీ నటులు, దేశీయ ముర్పొక్కు ద్రావిడ కళగం (డి.ఎం.డి.కె) అధినేత కెప్టెన్ విజయకాంత్‌ ఆరోగ్యం కుదుట పడటంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. జలుబు, దగ్గు, గొంతునొప్పితో నవంబర్‌ 18న చెన్నైలోని మియత్‌ ఇంటర్నేషనల్‌ హాస్పిటల్‌లో చేరిన విజయకాంత్ కు వైద్యులు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. నవంబరు 29న ఆయన శ్వాస పీల్చడంలో ఇబ్బందులు తలెత్తడంతో వెంటనే ఆయన్ని ఐసీయూ వార్డుకు తరలించి వెంటిలేటర్ పై చికిత్స అందించారు. దీనితో విజయకాంత్ ఆరోగ్యంపై అభిమానులు, డిఎండికే కార్యకర్తలు ఆందోళన చెందారు.

Captain Vijayakanth Health Status

ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై నెట్టింట వచ్చిన పలు ఊహాగానాలకు ఎప్పటికప్పుడు ఆస్పత్రి వర్గాలు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశాయి. అదే సమయంలో దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి, నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్‌, నిర్మాత శివ ఆస్పత్రికి వెళ్ళి పరామర్శించి విజయకాంత్(Vijayakanth) ఆరోగ్యంపై వస్తున్న రూమర్స్‌ కు వివరణ ఇచ్చారు.

అయితే విజయకాంత్ ఆరోగ్యం పూర్తిగా కుదుట పడటంతో సోమవారం (డిసెంబర్ 11)న మయత్ హాస్పిటల్ నుంచి విజయకాంత్‌ డిశ్చార్జ్‌ అయ్యారు. ఇదే విషయాన్ని ఆయన సతీమణి ప్రేమలత తెలిపారు. ఊపిరితిత్తులలో శ్లేష్మం ఎక్కువగా ఉండడంతో విజయకాంత్‌ ఇన్ని రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. విజయకాంత్ ఆరోగ్యంగా ఇంటికి చేరుకోవడంతో ఆయన అభిమానులు, డిఎండికే కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Kunal Thakur: పెళ్ళిపీటలెక్కిన ‘యానిమల్‌’ నటుడు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com