Captain Vijayakanth: ఆస్పత్రిలో చేరిన కెప్టెన్ విజయకాంత్‌

ఆస్పత్రిలో చేరిన కెప్టెన్ విజయకాంత్‌...

Hellotelugu-Captain Vijayakanth

ఆస్పత్రిలో చేరిన కెప్టెన్ విజయకాంత్‌… ఆందోళనలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు

Captain Vijayakanth : ప్రముఖ సినీ నటులు, దేశీయ ముర్పొక్కు ద్రావిడ కళగం (డి.ఎం.డి.కె) అధినేత కెప్టెన్ విజయకాంత్‌ ఆస్పత్రిలో చేరారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయనను ప్రస్తుతం చెన్నైలోని మయత్ అనే ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సినిమా నటుడిగా 20కు పైగా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో పోలీసు పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించిన వియజకాంత్(Vijayakanth)… గత కొంతకాలంగా డయాబెటిస్ తో బాధపడుతూ నడవలేని పరిస్థితుల్లో ఇంటికే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు మూడు వేళ్ళు తొలగించాల్సి వచ్చింది. అయితే ఇటీవల విజయకాంత్ కు అనారోగ్య సమస్యలు ఎక్కువ కావడంతో… కుటుంబ సభ్యులు అతడ్ని మయత్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఆయన ఆరోగ్యం పట్ల అటు అతని సినీ అభిమానులతో పాటు డి.ఎం.డి.కె కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

Captain Vijayakanth – పోలీసు అధికారి పాత్రలో మెప్పించిన విజయకాంత్

విజయకాంత్ గా తమిళనాట సుపరిచితం అయిన ఈయన పూర్తి పేరు విజయరాజ్ అలగర్‌స్వామి. ఇనిక్కుం ఇలామై సినిమాతో కోలీవుడ్ లో అడుగుపెట్టిన విజయకాంత్… 20కు పైగా సినిమాల్లో పోలీసు అధికారి పాత్రలో ప్రేక్షకులను మెప్పించారు. తమిళంలో కెప్టెన్ ప్రభాకరన్ గా విడుదలైన చిత్రం… తెలుగు, హిందీ భాషల్లో డబ్బింగ్ చిత్రంగా మంచి విజయం సాధించడంతో అతనికి కెప్టెన్ విజయకాంత్ గా గుర్తింపు పొందారు.

రాజకీయాల్లో అడుగుపెట్టిన కెప్టెన్ విజయకాంత్

సినీమా క్రేజ్ తో రాజకీయాల్లోకి ప్రవేశించి విజయం సాధించిన ఎంజిఆర్, కరుణానిధి, జయలలితల ప్రేరణతో కెప్టెన్ విజయకాంత్… 2005 సెప్టెంబరు 14న దేశీయ ముర్పొక్కు ద్రావిడ కళగం (డి.ఎం.డి.కె) పార్టీని స్థాపించాడు. పార్టీ ప్రారంభించిన తరువాత 2006లో జరిగిన మొదటి ఎన్నికల్లోనే 10 శాతానికి పైగా ఓట్లు సాధించారు. 2011 ఎన్నికల్లో అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట కజగం (ఎఐఎడిఎంకె) తో పొత్తు పెట్టుకుని 41 స్థానాల్లో పోటీ చేసి 29 స్థానాల్లో పార్టీను గెలిపించుకున్నారు. అయితే అనారోగ్య కారణాలతో ఆయన ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. పార్టీ బాధ్యతలను కోశాధికారి పదవితో సహా ఆయన సతీమణి ప్రేమలత విజయకాంత్‌ భుజాన వేసుకుని నడిపిస్తున్నారు.

పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలకు విజయకాంత్ దర్శనం

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయకాంత్‌ను కార్యకర్తలు అభిమానుల కోరిక మేరకు ఇటీవల ఆయన పుట్టిన రోజు సందర్భంగా దర్శనం కల్పించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన తన జన్మదిన వేడుకకు విజయకాంత్‌ హాజరయ్యారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిని చూసిన డి.ఎం.డి.కె కేడర్‌ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత నుంచి ఇంట్లోనే విజయకాంత్‌ ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు ఆరోగ్య పరంగా సమస్యలు తలెత్తడంతో హుటాహుటిన నగరంలోని ఓ ఆస్పత్రికి ఆదివారం తరలించారు. దీనితో వియజకాంత్(Vijayakanth) ఆరోగ్య పరిస్థితి విషమం అంటూ వదంతులు, ప్రచారాలు ఊపందుకున్నాయి. ఈ వదంతులకు ముగింపు పలికే విధంగా డీఎండీకే కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. విజయకాంత్‌కు సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ప్రస్తుతం ఆస్పత్రిలో చేర్పించినట్టు వివరించారు. ఆయన రెండు రోజులలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అవుతారని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేడర్‌కు భరోసా ఇచ్చారు.

Also Read : Karthika Nair: పెళ్ళి పీటలెక్కిన రంగం బ్యూటీ

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com