తమిళ సినీ ఫేం ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ విడుదలకు సంబంధించి మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. ఈ సినిమా రెండు విభాగాలుగా రానుందని పేర్కొన్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి పోస్టర్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి.
ధనుష్ తో పాటు కన్నడ సినీ స్టార్ శివ రాజ్ కుమార్ , అందాల ముద్దుగుమ్మలు ప్రియాంక మోహన్ , అదితి బాలన్ కీలక పాత్రలలో నటించనున్నారు. ఇదిలా ఉండగా కెప్టెన్ మిల్లర్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 15న విడుదల చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు.
అరువి చిత్రంతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది అదితి బాలన్. ఈ చిత్రంలో భాగం కానుంది. కెప్టెన్ మిల్లర్ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతోంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తుండడం విశేషం.
కెప్టెన్ మిల్లర్ పై ఆశలు పెట్టుకున్నాడు ధనుష్. ఇటీవలే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ చిత్రానికి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు.