Winter : ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అందుకే ప్రతీ ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా మహిళలు తమ కుటుంబం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంటారు. ఏ సమయంలో ఎలాంటి వంట చేయాలని ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలోనే వారికి ఎన్నో డౌట్స్ వస్తుంటాయి.
Winter :
ఇక ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే చలికాలంలో ఆకుకూరలు తినొచ్చా లేదా అనే డౌట్ కొంత మందిలో ఉంటుంది.దీనిపై పరిశోధకులు ఏం చెబుతున్నారంటే? ఆకుకూరల్లో ఏ,సీ,కే విటమిన్లు అధికంగా ఉంటాయి. ఫోలిక్ యాసిడ్స్ కూడా కావాల్సినంత ఉంటుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్ వీటిలో పుష్కలంగా ఉంటాయి. అందువలన వీటిని తినడం వలన ఆరోగ్యానికి హానికరం ఉండదు, ఏ కాలంలోనైనా తినొచ్చు అంట. అంతే కాకుండా రోజూ ఆకు కూరలను తీసుకోవడం వలన ఎర్ర రక్తకణాల వృద్ది జరిగి శ్వాస సంబంధమైన వ్యాధులు రాకుండా ఉంటాయంట. ముఖ్యంగా మహిళలు చలికాలం(Winter)లో పాలకూర తినడం వలన ముఖసౌందర్య పెరిగి ఆరోగ్యంగా ఉంటారంట.
Also Read : Breast Cancer : బ్లాక్ బ్రా వేసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా..?