Bunny Vas: మెగా, అల్లు ఫ్యామిలీలపై బన్నీ వాస్ ఆశక్తికర వ్యాఖ్యలు !

మెగా, అల్లు ఫ్యామిలీలపై బన్నీ వాస్ ఆశక్తికర వ్యాఖ్యలు !

Hello Telugu - Bunny Vas

Bunny Vas: మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య విభేధాలు తలెత్తినట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనికి ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికలు మరింత బలాన్ని చేకూర్చాయి. నువ్వానేనా అంటూ సాగిన ఈ ఎన్నికల్లో జనసేన అధినేత, మామయ్య పవన్ కళ్యాణ్ గెలుపుకు ఎక్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్… తన స్నేహితుడు నంధ్యాల వైసీపీ అభ్యర్ధి శిల్పా రవిచంద్ర కిశోర్ కు మాత్రం డైరెక్ట్ గా మద్దత్తు తెలిపారు. ఈ నేపథ్యంలో అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య వైరం తారా స్థాయికి చేరుకుందనే ప్రచారం మరోసారి జోరందుకుంది. అయితే ఈ ప్రచారంపై ఇరు కుటుంబాలకు సన్నిహితంగా ఉండే ప్రముఖ నిర్మాత, జనసేన నాయకుడు బన్నీ వాస్ స్పందించారు. తన కొత్త చిత్రం ‘ఆయ్‌’ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ లో ఆయన మాట్లాడారు.

Bunny Vas Comment

సార్వత్రిక ఎన్నికలకు ముందు… వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్‌కు మద్దతుగా అల్లు అర్జున్‌ ప్రచారం చేయడాన్ని ఉద్దేశిస్తూ ఓ విలేకరి ప్రశ్నించగా నిర్మాత బన్నీ వాస్(Bunny Vas) సమాధానమిస్తూ… ‘‘మెగా, అల్లు ఫ్యామిలీను నేను 20 ఏళ్లుగా చూస్తున్నా. కుటుంబ సభ్యులంతా కలిసి ఉండాలని చిరంజీవి కోరుకుంటారు. అందుకే ప్రతి సంక్రాంతికి ఫ్యామిలీని తీసుకొని బెంగళూరు వెళ్తుంటారాయన. అంతమంది స్టార్‌లను తీసుకెళ్లడం మామూలు విషయం కాదు. ఏ కుటుంబంలోనైనా ఒకరు తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని సందర్భాల్లో ఇష్యూస్‌ వస్తాయి. అంతమాత్రాన బంధం దెబ్బతిన్నట్లు కాదు. ఇలా తాత్కాలికమైన వాటిని హైలైట్‌ చేయడం మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. వారి బంధం గురించి తెలుసు కాబట్టే.. నమ్మకంగా చెబుతున్నా. ‘మేమంతా ఒక్కటే’ అని చెప్పేందుకు వారికి ఒక్క సందర్భం చాలు. సమయం రావాలంతే. ఇవన్నీ పాసింగ్‌ క్లౌడ్స్‌’’ అని పేర్కొన్నారు.

అంతేకాదు ఎమ్మెల్యే టికెట్‌ గురించి పవన్‌ కల్యాణ్‌ ను అడిగారా ? అనే ప్రశ్నకు వాసు(Bunny Vas) సమాధానమిస్తూ.. ‘‘2019లోనే పాలకొల్లు నుంచి నన్ను పోటీ చేయమన్నారు. ‘అప్పుడే వద్దు సర్‌. కొంత సమయం కావాలి’ అని చెప్పా. నువ్వు అలా ఆలోచించొద్దు. ఓడిపోయినా ఫర్వాలేదు. భయపడకు. ఏదేమైనా ముందడుగేయ్‌ అని ధైర్యాన్నిచ్చారు. కానీ, నేను ధైర్యం చేయలేకపోయా. 2024 ఎన్నికలకు ముందు కలిసినప్పుడు ఇంకా టైమ్‌ తీసుకుంటావా ? అని అడిగారు. అల్లు అరవింద్‌ సర్‌ తో మాట్లాడి చెబుతా అని సమాధానమివ్వగా ఆయనకు నా అభిప్రాయం అర్థమైంది. ఎప్పుడైతే నీకు నువ్వే నిర్ణయం తీసుకుంటావో అప్పుడు నన్ను సంప్రదించు అన్నారాయన’’ అని వివరించారు.

Also Read : Suriya: కన్నడ దర్శకుడితో సూర్య కొత్త సినిమా ?

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com