Unstoppable 4-Bunny : అన్ స్టాపబుల్ స్టేజీపై సందడి చేసిన పుష్ప రాజ్

పుష్ప2 సినిమా ప్రమోషన్లలో భాగంగా మరోసారి అన్ స్టాపబుల్ షోకు వచ్చి సందడి చేయబోతున్నారు అల్లు అర్జున్...

Hello Telugu - Unstoppable 4-Bunny

Unstoppable 4 : ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ సీజన్ 4(Unstoppable 4) కూడా విజయవంతంగా దూసుకుపోతుంది. మునుపెన్నడూ చూడని విధంగా బాలయ్య తన హోస్టింగ్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. సినీతారల కెరీర్, పర్సనల్ విషయాల గురించి అడియన్స్ కోరుకుంటున్న విషయాలను తెలుసుకుంటున్నారు. ఇప్పటికే మూడు సీజన్స్ సక్సెస్ కాగా.. ఇప్పుడు సీజన్ 4 సైతం ఆకట్టుకుంటుంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కాగా.. తాజాగా నాల్గవ ఎపిసోడ్ పై సర్ ప్రైజ్ ఇచ్చింది ఆహా టీం. శుక్రవారం నుంచి మూడవ ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కంగువ ప్రమోషన్లలో భాగంగా సందడి చేశారు. అలాగే సూర్యతో పాటు బాబీ డియోల్, డైరెక్టర్ శివ బాలయ్యతో కలిసి అలరించారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు. నాల్గవ ఎపిసోడ్ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నారని అధికారికంగా ప్రకటించారు.

Unstoppable 4 with Bunny

పుష్ప2 సినిమా ప్రమోషన్లలో భాగంగా మరోసారి అన్ స్టాపబుల్ షోకు వచ్చి సందడి చేయబోతున్నారు అల్లు అర్జున్. ఇప్పటికే అల్లు అర్జున్ ఎపిసోడ్ పోస్టర్ రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేయనున్నారు. గతంలో పుష్ప సినిమా ప్రమోషన్స్ సమయంలో సైతం బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి వచ్చి సందడి చేశాడు బన్నీ. ఇప్పుడు మరోసారి పుష్ప 2 ప్రమోషన్స్ కోసం వచ్చినట్లు తెలుస్తోంది. అన్‌స్టాపబుల్ షో నుంచే ఈ మూవీ ప్రమోషన్స్ షూరు చేయనున్నట్లు సమాచారం. మరోవైపు పుష్ప మూవీ ట్రైలర్ కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే ఈ విషయం గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. అలాగే పుష్ప ప్రమోషన్స్ పై దృష్టి పెట్టిన మేకర్స్.. ఇప్పుడు అన్‌స్టాపబుల్ షోలో బన్నీతో కలిసి డైరెక్టర్ సుకుమార్ కూడా రానున్నట్లు తెలుస్తోంది. కాగా అల్లు అర్జున్, బాలయ్యలను ఒకే వేదికపై చూడాలని ఫ్యాన్స్ ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇదే వేదికపై టీజర్ కూడా రిలీజ్ చేసే ఛాన్స్ లేకపోలేదు. అంతేకాకుండా బాలయ్య షోలో ఏయే అంశాలు చర్చకు వస్తాయో చూడాలి మరీ. పుష్ప 2 చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా.. రష్మిక మందన్నా, సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Also Read : Hero Nikhil : కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నిఖిల్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com