Bulli Raju : ఎవరీ బుల్లి రాజు అనుకుంటున్నారా. తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ కలిసి నటించిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) చిత్రంలో కీలక పాత్రలో పోషించాడు. వెంకీకి తనయుడిగా అద్భుతంగా నటించాడు. ఇందులో తన పాత్ర పూర్తిగా బూతులతో నిండి ఉంటుంది. అయినా ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరించారు. ఈ ఒకే ఒక్క సినిమా బుల్లి రాజు బుడ్డోడికి స్టార్ డమ్ తీసుకు వచ్చేలా చేసింది. ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి.
Sankranthiki Vasthunnam Child Actor Bulli Raju
ఊహించని రీతిలో ఏకంగా స్టార్ హీరోల సినిమాలను తలదన్ని 10 రోజుల్లోనే రూ. 235 కోట్లకు పైగా వసూలు చేసింది. అరుదైన ఫీట్ సాధించింది. విక్టరీ వెంకటేష్ సినీ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక చూస్తే చిన్నోడైనా బుల్లి రాజు పాత్రలో ఒదిగి పోయి ప్రేక్షకుల మనసు దోచుకున్న రేవంత్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారి పోయాడు.
తనకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి ప్రేమ. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో భీమవరంలో జన సేన పార్టీకి ఓటు వేయండంటూ ప్రచారం కూడా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడం..అది డైరెక్టర్ అనిల్ రావిపూడి కంట్లో పడడంతో మనోడికి బంపర్ ఛాన్స్ దక్కింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. సినిమాతో పాటు బుల్లి రాజుకు భలే పేరొచ్చింది. ఇంకేం డజనుకు పైగా సినిమాలలో నటించేందుకు అవకాశం వచ్చినట్లు టాక్.
Also Read : Hero Vijay Meet : రథసారథితో దళపతి ములాఖత్