Kichcha Sudeep : శాండిల్ వుడ్ టాప్ హీరో కిచ్చా సుదీప్ సంచలన ప్రకటన చేశాడు. పూర్తి యాక్షన్, అడ్వెంచర్ కథతో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు. పేరు కూడా వెల్లడించాడు. బిల్లా రంగా బాషా అని టైటిల్ కూడా వెల్లడించాడు. ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని తెలిపాడు. ఈ మూవీ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారని, అందుకే కీలక అప్ డేట్ ఇవ్వాల్సి వచ్చిందన్నాడు. దాదాపు నెలల తరబడి వాయిదా పడుతూ వచ్చింది. దీని వెనుక కొంత ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని పేర్కొన్నాడు కిచ్చా సుదీప్.
Kichcha Sudeep New Movie Updates
బిల్లా రంగా బాషా న్యూ మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్ ను పంచుకున్నాడు సామాజిక మాధ్యమంలో. ఏప్రిల్ 16న బుధవారం సెట్స్ లోకి వెళ్లిందన్నాడు. బీఆర్బీ ది ఫస్ట్ బ్లడ్ అనే పేరు కూడా దీనికి పెట్టామన్నాడు. ఇది 2209 ఏడీ కాలానికి వ్యతిరేకంగా సెట్ చేశామన్నారు కిచ్చా సుదీప్(Kichcha Sudeep). గతంలో మార్చి రెండో వారంలో ప్రారంభం అవుతుందని పేర్కొన్నాడు. కానీ వాయిదా పడుతూ వచ్చింది. బిల్లా రంగ బాషా కన్నడ నటుడు చిత్ర నిర్మాత అనుప్ భండారీతో కలిసి చేస్తుండడం విశేషం.
ఈ ఇద్దరు కలిసి చేసిన తొలి ప్రాజెక్టు బిగ్ సక్సెస్ గా నిలిచింది. ఈ కొత్త మూవీ కథ రెండు శతాబ్దాల ముందు నాటిదని సమాచారం. బీఆర్బీ ది ఫస్ట్ బ్లడ్ రెండు భాగాలుగా రానుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు సంబంధించి 3డీ సెట్ లతో పాటు విస్తృతంగా వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ను యూజ్ చేయనున్నట్లు ప్రకటించాడు కిచ్చా సుదీప్. తను నటించిన చివరి చిత్రం మాక్స్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది.
Also Read : Hero Vijay Deverakonda :జోరు పెంచిన విజయ్ దేవరకొండ