తెలుగు సినీ రంగంలో నట దిగ్గజంగా , కమెడియన్ గా గుర్తింపు పొందిన బ్రహ్మానందం ఉన్నట్టుండి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆయన కీలక పాత్రలో నటించిన కీడా కోలా ప్రమోషన్ కార్యక్రమంలో ప్రశంసల జల్లు కురిపించాడు.
ఈ చిత్రానికి పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో టాప్ డైరెక్టర్ స్థాయికి చేరుకున్న వరంగల్ నగరానికి చెందిన తరుణ్ భాస్కర్ తీశాడు కీడా కోలాను. పేరు కూడా డిఫరెంట్ గా ఉంది. అన్నింటిని సమపాళ్లలో ఉండేలా తీశాడంటూ కితాబు ఇచ్చాడు బ్రహ్మానందం.
ఈ తాజా మూవీలో బ్రహ్మితో పాటు చైతన్య రావు, రాగ్ మయూర్ కూడా నటించారు. ఇది పూర్తిగా కామెడ్, క్రైమ్ ఆధారంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు తరుణ్ భాస్కర్. ఈ సందర్బంగా తరుణ్ ను ఆకాశానికి ఎత్తేశాడు బ్రహ్మి.
తను తొలి నాళ్లలో సినీ రంగానికి పరిచయం చేసిన ప్రముఖ దివంగత దర్శకుడు జంధ్యాలతో చేసినట్టుగా అనిపించిందని పేర్కొన్నాడు. తన సినీ కెరీర్ లో కీడా కోలాను మరిచి పోలేనని చెప్పారు బ్రహ్మానందం.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రౌడీ బాయ్ గా పేరు పొందిన విజయ్ దేవరకొండ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. తరుణ్ భాస్కర్, వంగా సందీప్ రెడ్డి, విజయ్ ఒకే గూటి పక్షలు. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చినా అందరి కలలు ఒక్కటే. వీరంతా తమకు తాముగా సక్సెస్ అయ్యారు.