Brahmanandam Family Visit : పవిత్ర పుణ్య క్షేత్రమైన తిరుమలలో కొలువు తీరిన శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించు కునేందుకు దిగ్గజ నటుడు , హాస్య బ్రహ్మ బ్రహ్మానందం , తన కుటుంబంతో తరలి వచ్చారు. ఈ సందర్బంగా ఆయనను చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు.
Brahmanandam Family Visit Tirumala
తిరుమల శ్రీవారిని ఇవాళ ఉదయం బ్రహ్మానందం కుటంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. దర్శనానికి సంబంధించి ఏర్పాట్లు చేశారు.
ఇదిలా ఉండగా బహ్మానందం వెళ్లే వాహనం వద్ద సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. దీంతో జర జాగ్రత్త వాహనం మీపైకి వెళుతుంది జర జాగ్రత్త నాయనా అంటూ హాస్య బ్రహ్మ తనదైన స్టైల్ లో సుతిమెత్తగా హెచ్చరించారు.
తాజాగా బ్రహ్మానందం తన తనయుడి పెళ్ళిని అంగ రంగ వైభవోపేతంగా హైదరాబాద్ లో నిర్వహించారు. సినీ , రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. నూతన జంటను ఆశీర్వదించారు.
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేకంగా హాజరైన నూతన వధూవరులను దీవించారు.
Also Read : Pragya Nagra Vs Sakshi Malik