Brahmanandam : జీవితం మనం అనుకున్నట్టు సాగదు. కాలం పెట్టే పరీక్షకు ప్రతి ఒక్కరం హాజరు కావాల్సిందే. ఇంతటి స్థాయి రావడానికి, నేను గొప్ప కమెడియన్ గా గుర్తింపు పొందడానికి ఎందరో అందించిన చేతులు ఉన్నాయి. ప్రత్యేకించి నేను ముందుగా రుణపడి ఉన్నది మాత్రం నా తల్లిదండ్రులకు. ఒక రోజు మా నాన్న నన్ను పిలిచి జీవిత సత్యం చెప్పారు.
Brahmanandam Comments
ఆయన నిరంతరం శ్రమజీవి. ఒరేయ్ ఏమైనా చేయి..కానీ ఎవరినీ చేయి చాచి అడగకు అన్నారు. అంతే కాదు 16 రోజుల పాటు ఉపవాసం ఉండి చూడు..ఏమీ కాదు..వీలైతే చని పోతావ్. కానీ 17వ రోజు మాత్రం తప్పకుండా నీ మీద నీకు నమ్మకం ఏర్పడుతుందని గుర్తు చేసుకున్నారు ప్రముఖ దిగ్గజ నటుడు, కమెడియన్ 1200లకు పైగా సినిమాలలో నటించిన బ్రహ్మానందం(Brahmanandam).
ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలను, జ్ఞాపకాలను పంచుకున్నారు చిట్ చాట్ లో. తాను ఎక్కువగా ఎమోషనల్ అయ్యింది మాత్రం తనకు సోదరుడి లాంటి వాడైన ఎంఎస్ నారాయణ విషయంలో అని వాపోయాడు. చివరి రోజుల్లో బెడ్ పై ఉన్నాడు. ఆ సమయంలో అందరినీ కాదనుకుని తనను కలవాలని ఉందంటూ ఓ కాగితం మీద రాసుకున్నాడు. ఆ విషయం కూతురు గుర్తించి నాకు ఫోన్ చేసింది. నేను అప్పుడు షూటింగ్ లో ఉన్నా. డైరెక్టర్ కు చెప్పకుండా వెళ్లా. తను నా చేయి పట్టుకున్నాడు. ఆ తర్వాత వదిలేశాడు.
గొప్ప నటుడే కాదు. అద్భుతమైన సెన్సాఫ్ హ్యూమర్ ఉన్నోడు. మేధావి. కానీ చిన్నతనంలోనే పోయాడంటూ కన్నీటి పర్యంతం అయ్యారు బ్రహ్మానందం. చిత్రాలు గీస్తాను. శిల్పం చెక్కుతాను. నటన కూడా ఏదీ ఎవరి దగ్గరా నేర్చు కోలేదన్నారు . అంతా స్వతహ సిద్దంగా వచ్చిందంటూ చెప్పారు. ముఖ్యంగా తనలో టాలెంట్ ఉందని ప్రోత్సహించిన జంధ్యాలకు, నన్ను ప్రోత్సహిస్తూ వచ్చిన చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు బ్రహ్మానందం.
Also Read : రాగిన్ రాజ్ కు మంచి భవిష్యత్తు ఉంది