Brahmanandam : హాస్య బ్రహ్మగా పేరు పొందిన బ్రహ్మానందం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అభినందనలతో ముంచెత్తారు. జాతీయ స్థాయిలో 69 ఏళ్ల తర్వాత ఉత్తమ నటుడిగా అవార్డు పొందడం తనకు గర్వ కారణంగా ఉందన్నారు. ఇన్నేళ్లుగా ఎన్నో సినిమాలు వచ్చాయని, కానీ పుష్ప లాంటి సినిమా రాలేదని పేర్కొన్నారు.
Brahmanandam Appreciates to Allu Arjun
తన కళ్ల ముందే పెరిగిన కుర్రాడు ఇవాళ జాతీయ స్తాయిలో పురస్కారం దక్కడం పట్ల తనకు ఎంతో సంతోషం కలిగించదని పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా బ్రహ్మానందం(Brahmanandam) స్పందించారు. అల్లు అర్జున్ మంచి ఈజ్ ఉన్న నటుడని కితాబు ఇచ్చారు.
ఇదిలా ఉండగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప మూవీకి గాను ఈ అవార్డు దక్కింది బన్నీకి. మాస్ డైలాగులతో మెస్మరైజ్ చేశాడు అల్లు అర్జున్. చంద్రబోస్ రాసిన పాటలు, దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం పుష్ప మూవీని ఓ రేంజ్ లోకి తీసుకు వెళ్లేలా చేసింది.
ఇదే సమయంలో అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసింది. ప్రస్తుతం పుష్ప ఆశించిన దానికంటే బిగ్ సక్సెస్ సాధించడంతో ఇదే సినిమాను సీక్వెల్ తీస్తున్నారు దర్శకుడు సుకుమార్.
Also Read : Lal Salaam Movie : డిసెంబర్ లో రానున్న లాల్ సలామ్