Ekta Kapoor : బాలీవుడ్ నటి, నిర్మాత ఏక్తా కపూర్(Ekta Kapoor) కు కోలుకోలేని షాక్ తగిలింది. ఆమెపై విచారణ చేపట్టాలని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయానికి సంబంధించి మే9వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. తను ఎన్నో వెబ్ సీరీస్ లు , సీరియల్స్ నిర్మించింది. తను నిర్మించిన ప్రతి ఒక్కటి పాపులర్ అయ్యింది. వీటిని బాలాజీ టెలి ఫిలింస్ ఆధారంగా తీసింది.
Ekta Kapoor-Bambay Court Shocked
ఈ మధ్యన ఓటీటీల హవా కొనసాగుతోంది. ఓ వైపు సినిమాలు, మరో వైపు సీరియల్స్ ఇంకో వైపు ఓటీటీలకు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో విదేశీ సంస్థలతో పాటు దేశీయ మీడియా, మూవీ దిగ్గజ సంస్థలు సైతం పోటీ పడుతున్నాయి. అయితే ఎలాంటి సెన్సార్సిప్ అన్నది లేక పోవడంతో సెక్కు, హింస మరింత పెరిగిందనే విమర్శలు ఉన్నాయి.
ఈ తరుణంలో ఏక్తా కపూర్ హాట్ టాపిక్ గా మారారు. తాజాగా తను ఓ వివాదంలో ఇరుక్కుంది. భారత దేశానికి చెందిన సైనికులను కించ పరిచిందంటూ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ బొంబాయి కోర్టు ఆదేశించింది. ఏక్తా కపూర్ రూపొందించిన వెబ్ సీరీస్ లో సైనికులను అవమానించారంటూ ఫిర్యాదు దాఖలైంది. దీనికి సంబంధించి కోర్టు ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read : IPL Final Schedule : టాటా ఐపీఎల్ 2025 షెడ్యూల్ ఖరారు