Bollywood Heros: గుట్కా ప్రకటనల్లో నటించినందుకు ప్రముఖ బాలీవుడ్(Bollywood) నటులు షారూక్ ఖాన్, అక్షయ్‌కుమార్, అజయ్ దేవ్‌గణ్ కు కేంద్రం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గుట్కా ప్రకటనలపై మోతీలాల్ యాదవ్ అనే న్యాయవాది అలహాబాద్ హైకోర్టు వేసిన కేసు విచారణ సందర్భంగా కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించింది. డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్‌బీ పాండే… ఇదే విషయాన్ని అలహాబాద్ హైకోర్టుకు లిఖిత పూర్వకంగా తెలిపారు.
Bollywood Heros Receiving Notices from Central Govt
ఇక కేసు విషయానికి వస్తే… భారత ప్రభుత్వం నుంచి పురస్కారాలు అందుకొన్న సినీ తారలు ప్రజలను తప్పుదోవపట్టించే గుట్కా ప్రకటనల్లో నటించడం అనైతికం, చట్ట వ్యతిరేకం అంటూ మోతీలాల్ యాదవ్ అనే లాయర్ 2022లో అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీనితో ఆయా హీరోలపై తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో మోతీలాల్ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనితో గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై ఏలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ అలహాబాద్ కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. కోర్టు నోటీసులపై స్పందించిన డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్‌బీ పాండే… ఇప్పటికే ఆ ముగ్గురు నటులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు న్యాయస్థానానికి తెలిపారు. దీనితో బాలీవుడ్ నటులకు నోటీసులు జారీ చేసిన విషయం బయటకు వచ్చింది.
Also Read : Sridevi: శ్రీదేవికి నివాళిగా ఖజురహో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్