Kumar Shahani: బాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, రచయిత, నిర్మాత, విద్యావేత్త కుమార్ సహాని (83) అనారోగ్యంతో శనివారం రాత్రి మృతి చెందారు. కోల్ కతా లోని తన నివాసంలో మృతి చెందారు. కుమార్ సహానీ మరణ వార్త తెలిసి… పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 1940 డిసెంబర్ 7న సింధ్ లోని లర్కానాలో (ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉంది) జన్మించిన కుమార్ సహాని… పాకిస్తాన్ విభజన తర్వాత ఆయన కుటుంబం ముంబైకి వచ్చేసి ఇక్కడే స్థిరపడింది.
ముంబై యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లో బీఏ గ్రాడ్యుయేట్ చేసిన కుమార్ సహాని(Kumar Shahani)… ఆ తర్వాత పూణే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ)లో డైరెక్షన్ కోర్స్ చేశారు. ఆ తరువాత చదువుల కోసం విదేశాలకు వెళ్ళిన కుమార్ సహాని… ఫ్రెంచ్ ప్రభుత్వం అందించిన స్కాలర్ షిప్ తో IDHEC లో పలు కోర్సులను పూర్తి చేసారు. అక్కడే అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని సినిమాలకు పనిచేసిన తరువాత… తిరిగి ఇండియాకు వచ్చి దర్శకునిగా మారారు.
Kumar Shahani No More
విదేశాల నుండి ఇండియాకు తిరిగి వచ్చిన తరవాత కుమార్ సహాని… 1972లో ‘మాయా దర్పన్’, 1984లో ‘తరంగ్’, 1989లో ‘ఖయల్ గాధ’, 1990లో ‘కస్బా’ లాంటి హిట్ సినిమాలు తీశారు. ‘మాయా దర్పణ్’ సినిమా జాతీయ ఉత్తమ చలన చిత్రంగా అవార్డు సొంతం చేసుకుంది. కేవలం దర్శకుడిగానే కాకుండా మంచి విద్యావేత్తగా, రచయితగా, నిర్మాతగా బాలీవుడ్ లో తనదైన ముద్ర వేసారు. 1976లో హోమీ భాభా ఫెలోషిప్ ను పొందిన కుమార్ సహానీ…. రెండేళ్ళ పాటు మహాభారతం, బౌద్ధ ఐకానోగ్రఫీ, భారతీయ శాస్త్రీయ సంగీతం మరియు భక్తి ఉద్యమం గురించి అధ్యయనం చేసారు.
Also Read : Urvashi Rautela: పుట్టిన రోజు సందర్భంగా గోల్డ్ కేక్ కట్ చేసిన సెక్సీ డాల్ !