Evol: చిన్న సినిమాలకు ఎప్పుడూ ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ప్రతీ శుక్రవారం ఏదో ఒక పెద్ద హీరో సినిమా విడుదల ఉండటంతో వీటికి థియేటర్లే సరిగా దొరకవు. ఒకవేళ దొరికినా సరే పూర్ కంటెంట్ వల్ల వచ్చిన రోజే మాయమైపోతుంటాయి. అయితే కొన్నిసార్లు మాత్రం కాంట్రవర్సీలతో ఫేమస్ అయి ప్రేక్షకుల దృష్టిలో పడుతుంటాయి. అలా సెన్సార్ చిక్కులు ఎదుర్కొన్న ఓ తెలుగు సినిమా… ఇప్పుడు నేరుగా ఓటీటీలో రిలీజయ్యేందుకు రెడీ అయిపోయింది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ చేయడంతో ఆ బోల్డ్ మూవీ గురించి ఓటీటీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Evol Movie…
ఇంగ్లీష్‌లో లవ్ అనే పదాన్ని తిరగేసి రాస్తే ‘ఎవోల్(Evol)’ అని వస్తుంది. ఇదే టైటిల్ తో రామ్ వెలగపూడి అనే దర్శకుడు ఓ సినిమా తీశాడు. జూలైలోనే థియేటర్లలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో సెన్సార్ బోర్డు ఈ సినిమాను బ్యాన్ చేసింది. దీనితో దర్శకుడు రామ్ వెలగపూడి ఓటీటీ బాట పట్టారు. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం ఆహా లో ఆగస్టు 15 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇక ‘ఎవోల్’ సినిమా విషయానికి వస్తే… రెండు జంటల మధ్య జరిగే స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించారు. అందరూ కొత్త ఆర్టిస్టులే కావడంతో అవకాశాల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో కాస్తా బోల్డ్ గానే నటించినట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబరులో ట్రైలర్ రిలీజ్ చేశారు. నెల క్రితం ప్రెస్ మీట్ పెట్టారు. కానీ సెన్సార్ అడ్డంకులు ఎదురవడంతో ఇప్పుడు ఓటీటీ రూటులోకి వచ్చేశారు. మరి బోల్డ్ అంటున్నారు. సెన్సార్ బోర్డు ఎందుకు బ్యాన్ చేసింది. సెన్సార్ బోర్డ్ బ్యాన్ చేసేంతగా ఈ సినిమాలో ఏముంది తెలుసుకోవాలంటే ఓ మూడు రోజులు ఆగాల్సిందే…
Also Read : Avika Gor : ఇంత స్వల్ప సమయంలో అలాంటి అవకాశం వస్తుంది అనుకోలేదు