Vijay Sethupathi : విలక్షణ నటనకు పెట్టింది పేరు తమిళ సినీ రంగానికి చెందిన విజయ్ సేతుపతి(Vijay Sethupathi). తను తమిళం, తెలుగు, హిందీ సినిమాలలో నటించి మెప్పించాడు. బహు భాషా నటుడిగా గుర్తింపు పొందాడు. తెలుగులో బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన చిత్రంలో ప్రతి నాయకుడిగా తను పోషించిన పాత్ర మరింత పేరు తీసుకు వచ్చేలా చేసింది.
Vijay Sethupathi Starts New Category
ఇక డైనమిక్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా హిందీ మూవీ జవాన్ లో అగ్ర నటుడు షారుక్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించగా అందులో విలన్ గా దుమ్ము రేపాడు విజయ్ సేతుపతి.
అంతకు ముందు పలు సినిమాలలో నటించినా ప్రతి నాయకుడిగానే తనకు ఎక్కువగా పేరు వచ్చింది. తాజాగా అందుకు భిన్నంగా రూట్ మార్చాడు. పూర్తిగా డిఫరెంట్ రోల్ తో ముందుకు వస్తున్నాడు తాజా చిత్రం ఏసీఈలో. ఇది పూర్తిగా క్రైమ్ అండ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు.
ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుండగా టైటిల్ తో పాటు విడుదల చేసిన టీజర్ కు భారీ ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమా మీద అంచనాలు మరింత పెంచేలా చేశాయి. విజయ్ సేతుపతి పుట్టిన రోజు సందర్బంగా మూవీ మేకర్స్ ప్రత్యేక గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
Also Read : Hero Ajith Vidaamuyarchi : ఫిబ్రవరి 6న రానున్న అజిత్ పట్టుదల