Delhi : దేశ రాజధాని హస్తినలో భారతీయ జనతా పార్టీ(BJP) జెండా ఎగుర వేసింది. 27 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత కమలం వికసించింది. 10 ఏళ్ల పాటు పాలనలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ తన పవర్ ను కోల్పోయింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 693 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
Delhi Elections BJP Won..
ఆప్ , బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు పోటీ చేశారు. ఊహించని విధంగా బీజేపీ 47 సీట్లను కైవసం చేసుకుంది. 23 సీట్లకే పరిమితమైంది. అధికారానికి దూరమైంది. కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోయింది.
ఆప్ కు చెందిన అతిరథ మహారథులు ఈసారి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. నువ్వా నేనా అన్న రీతిలో జరిగింది ఎన్నికల ప్రచారం. బీజేపీ పెద్ద ఎత్తున హామీలను గుప్పించింది. ఈ సందర్బంగా బీజేపీ గెలుపుతో ఆ పార్టీలో సంబురాలు మిన్నంటాయి.
ఎన్నికల ఫలితాలపై స్పందించారు ఆప్ చీఫ్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ప్రజా తీర్పును గౌరవిస్తామని అన్నారు. తమకు ఓటు వేసి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకు ఓడి పోయామనే దానిపై తాము పరిశీలన చేసుకుంటామని స్పష్టం చేశారు.
Also Read : Megastar Happiness :మోదీతో సమావేశం మెగాస్టార్ సంతోషం