Delhi New CM : న్యూఢిల్లీ – బీజేపీ హైకమాండ్ సంచలన ప్రకటన చేసింది. అందరూ ఊహించినట్లుగానే ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను చెప్పి మరీ ఓడించిన పర్వేశ్ వర్మను ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఖరారు చేసింది. కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ , తదితరులతో కూడిన కమిటీ ప్రత్యేకంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యింది.
Delhi New CM Parvesh Varma Final
ఢిల్లీ సీఎం రేసులో పలువురు నేతలు ఆశించినా చివరకు పర్వేశ్ వర్మ(Parvesh Verma)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు ట్రబుల్ షూటర్ అమిత్ చంద్ర షా. ఢిల్లీలో 27 ఏళ్ల సుదీర్ఘ కాలం అనంతరం భారతీయ జనతా పార్టీ కాషాయ జెండాను ఎగుర వేసింది. ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి డబుల్ ఇంజన్ సర్కార్ పని చేస్తుందని, బీజేపీని పవర్ లోకి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో ఆయన పర్వేశ్ వర్మను ప్రత్యేకంగా అభినందించారు. దీంతో మోడీ మనసులో వర్మకే సీఎం ఛాన్స్ దక్కుతుందని అంతా భావించారు.
తను ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఫ్రాన్స్ లో జరిగే ఏఐ సదస్సుకు హాజరయ్యే కంటే ముందు అమిత్ షా, జేపీ నడ్డా పీఎంను కలిశారు. ఈ సందర్బంగా పర్వేశ్ వర్మను ఖరారు చేయాలని సూచించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా పర్వేశ్ వర్మ గతంలో జర్నలిస్ట్ గా పని చేశాడు. రెండుసార్లు ఎంపీగా గెలుపొందాడు. తన తండ్రి సాహిబ్ సింగ్ వర్మ ఢిల్లీ సీఎంగా పని చేశారు.
Also Read : ఆస్పత్రిలో చేరిన పృథ్వీ రాజ్