Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ మూవీపై ఎటువంటి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ ఈ మూవీ నుంచి ఈ మధ్యకాలంలో ఎటువంటి అప్‌డేట్ రాకపోవడంతో.. నిరాశకు లోనైన అభిమానులు అసభ్య పదజాలంతో చిత్రయూనిట్‌పై సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. దర్శకుడు శంకర్‌ను, నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ను ట్యాగ్ చేస్తూ.. నానా యాగీ చేస్తున్నారు. దీనిపై సంగీత దర్శకుడు థమన్ వారించినా.. అస్సలు వినకపోవడంతో.. చేసేది లేక మేకర్స్ ఈ వినాయక చవితిని పురస్కరించుకుని అదిరిపోయే పోస్టర్‌తో అప్డేట్ ఇచ్చారు.
Game Changer Movie Updates
‘గేమ్ చేంజర్(Game Changer)’ సెకండ్ సింగిల్ ఈ సెప్టెంబర్‌లో అంటూ విడుదల చేసిన ఈ పోస్టర్‌లో రామ్ చరణ్(Ram Charan)ని చూసిన మెగా ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు. కారణం ఈ పోస్టర్‌లో ఫ్యాన్స్ ఏం కావాలో అది ఇచ్చేశారు మేకర్స్. మరీ ముఖ్యంగా రామ్ చరణ్ తలకు ఎర్ర కండువా కట్టి.. ‘జనసేన’కు లింక్ అయ్యేలా చేయడమే కాకుండా.. జాతరకు సిద్ధమవ్వండి అనేలా జాతర సెటప్‌తో.. చరణ్ స్టెప్ వేస్తున్న పిక్‌ని మేకర్స్ వదిలారు. ఇప్పుడీ పోస్టర్ అన్నింటికీ సమాధానం చెబుతూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వినాయక చవితి శుభాకాంక్షలతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ పోస్టర్‌ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘జరగండి జరగండి..’ సాంగ్ సెన్సేషన్‌ని క్రియేట్ చేయగా.. ఇప్పుడు సెకండ్ సింగిల్ అప్డేట్‌తో కొన్ని రోజుల పాటు ఈ సినిమా ట్రెండ్‌లో హల్చల్ చేయనుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని క్రిస్మస్ స్పెషల్‌గా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ప్రముఖ ఆడియో కంపెనీ సారేగమ ఈ సినిమా ఆడియో రైట్స్‌ను ఫ్యాన్సీ ప్రైజ్‌కి దక్కించుకుంది.
Also Read : AAY Movie OTT : ఓటీటీలోకి రానున్న ఎన్టీఆర్ బావమరిది సినిమా ‘ఆయ్’