Pawan Kalyan : పవర్ స్టార్ , జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 2 పవన్ బర్త్ డే. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
Pawan Kalyan Birthday Arrangements
భవన నిర్మాణ కార్మికులతో సహ పంక్తి భోజనాలు , రెల్లి కాలనీల సందర్శన, పుట్టిన రోజు వేడుకలు నిర్వహించనున్నారు. రక్త దాన శిబిరాలు , బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల వసతి గృహాల సందర్శన , పుస్తకాలు, పెన్నులు అవసరమైన వస్తువులను బహూకరించడం జరుగుతుందని జనసేన పార్టీ వెల్లడించింది.
అంతే కాకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ పేర్కొంది. దివ్యాంగులకు అవసరమైన వస్తువులు వితరణ చేయడం జరుగుతుందని తెలిపింది. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటుడిగా కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత సమాజంలో మార్పు కోసం జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేశారు. ఓటమి పాలయ్యారు.
ఆశించిన మేర ఫలితాలు రాక పోయినప్పటికీ మెరుగైన ఓటు బ్యాంకును సాధించడంలో కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్. తన అన్న స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీలో కీలక భూమిక నిర్వహించారు. ఆయన తండ్రి ప్రముఖ నటుడు దివంగత అల్లు రామలింగయ్య. సోదరులు చిరంజీవి, నాగ బాబు.
Also Read : Allu Arjun : అంచనాలకు మించి పుష్ప- 2