Big Boss Vichithra: తెలుగు అగ్రహీరోపై లైంగిక వేధింపుల ఆరోపణలు ?

తెలుగు అగ్రహీరోపై లైంగిక వేధింపుల ఆరోపణలు ?

Hello Telugu - Big Boss Vichithra

Big Boss Vichithra : టాలీవుడ్ ను మరోసారి కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చుట్టుముడుతున్నాయి. తమిళ బిగ్ బాస్ లో కనెస్టెంట్ గా ఉన్న విచిత్ర ఓ తెలుగు అగ్రహీరోపై సంచలన వ్యాఖ్యలు చేసింది. మీ జీవితంగా కష్టంగా భావించిన సంఘటన ఏంటని బిగ్ బాస్ అడిగిన ప్రశ్నకు… నటి విచిత్ర సమాధానం చెప్తూ 2001లో ఓ ప్రముఖ హీరోతో తెలుగు సినిమాలో నటిస్తున్నప్పుడు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు ఆమె బిగ్ బాస్ లో చెప్పారు. పాలక్కడ్ ప్రాంతంలో సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్పుకొచ్చింది. అయితే తెలుగు సినిమా పేరు కాని, హీరో పేరు కాని ఆమె వెల్లడించలేదు. అయితే ఆ సమయంలో జరిగిన సినిమా షూటింగ్ బట్టి ఓ తెలుగు అగ్రహీరో పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Big Boss Vichithra – పాలక్కడ్ షూటింగ్ లో లైంగిక వేధింపులకు గురైన విచిత్ర ?

పాలక్కడ్ లోని ఓ తెలుగు సినిమా షూటింగ్ లో పాల్గొన్న తనను ఓ ప్రముఖ హీరో నేరుగా తనకు రూముకు రమ్మని ఆహ్వానించారని విచిత్ర(Vichithra) ఆరోపించింది. దీనితో షాక్ కు గురైన తాను… అక్కడ నుండి మెల్లగా తప్పించుకున్నానని… అయితే ఆ తరువాత రోజు నుండి ఈ సినిమా సెట్ లో తనకు వేధింపుల పర్వం మొదలైందన్నారు. ప్రతీ రోజూ ఎవరో వచ్చి తన రూం తలుపులు తట్టేవారని… హోటల్ మేనేజర్ సహాయంతో తను రోజుకో రూమ్ మారినప్పటికీ వేధింపులు ఆగలేదని ఆమె బిగ్ బాస్ కు చెప్పింది. అంతేకాదు ఇదే విషయంపై సమీపంలో ఉన్ స్టంట్ మాస్టర్, నడిగర్ సంఘం కు పిర్యాదు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంతో పాటు తిరిగి తననే నిందించారని ఆమె ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే తాను సినిమా జీవితానికి చెక్ పెట్టి… పెళ్ళి చేసుకుని సెటిలయ్యానని చెప్పుకొచ్చింది.

కేవలం రెండు తెలుగు సినిమాలు మాత్రమే చేసిన విచిత్ర !

తెలుగు సినిమా షూటింగ్ లో ప్రముఖ హీరో నుండి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని నటి విచిత్ర(Vichithra) సంచలన ఆరోపణలు చేయడంతో… ఇప్పుడు ఆ తెలుగు సినిమాలు ఏంటి ? ఆమెను లైంగిక వేధింపులకు గురిచేసిన ఆ హీరో ఎవరు ? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే విచిత్ర తెలుగులో కేవలం రెండే రెండు సినిమాల్లో నటించింది. మొదటి సినిమా వెంకటేష్ నటించిన పోకిరి రాజా కాగా రెండోది యువరత్న బాలకృష్ణ నటించిన బలేవాడివి బాసూ. అయితే పోకిరి రాజా సినిమా 1995లోనే విడుదల కావడం…. బలేవాడివి బాసూ మాత్రమే 2001లో రిలీజ్ కావడంతో ఈ కాస్టింగ్ కౌచ్ వివాదంలో అందరి వేళ్ళు బాలకృష్ణవైపు చూపిస్తున్నాయి.

చిక్కుల్లో అప్పటి నడిగర్ సంఘం అధ్యక్షులు విజయ్ కాంత్ !

నటి విచిత్ర చేసిన కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు టాలీవుడ్ నే కాదు కోలీవుడ్ లో కూడా సంచలనంగా మారింది. 2001 సంవత్సరంలో ఓ సినిమా షూటింగ్ లో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులకు అప్పట్లో నడిగర్ సంఘంకు ఫిర్యాదు చేసానని… అయితే వారు స్పందించకపోగా… తిరిగి తననే నిందించారని… దీనితో తప్పనిసిరి పరిస్థితుల్లో తన సినీ జీవితాన్ని ముగించాల్సివచ్చిందని ఆమె పేర్కొన్నారు. అయితే అనూహ్యంగా తన రూమ్ లను మార్చి ఆ అగ్రహీరో లైంగిక వేధింపుల నుండి కాపాడిన హోటల్ మేనేజర్ నే ఆమె పెళ్ళి చేసుకుంది.

ఇది ఇలా ఉండగా 2001 సమయంలో ప్రముఖ కోలీవుడ్ నటుడు విజయ్ కాంత్ నడిగర్ సంఘం అధ్యక్షులుగా ఉండటంతో… ఆయన ఇప్పుడు చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ తెలుగు హీరోను వెనకేసుకొచ్చిన విజయ్ కాంత్… ఓ తమిళ అమ్మాయికి అన్యాయం చేసారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read : Animal: ధోనీ రికార్డు బ్రేక్ చేసిన రణ్ బీర్ కపూర్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com