Big Boss Telugu: బిగ్‌బాస్‌ నిర్వాహకులకు పోలీసుల నోటీసులు !

బిగ్‌బాస్‌ నిర్వాహకులకు పోలీసుల నోటీసులు !

Hello Telugu - Big Boss Telugu

Big Boss Telugu: బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 7 నిర్వాహకులకు జూబ్లీహిల్స్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బిగ్‌బాస్‌ సీజన్-7 ఫైనల్స్‌ సమయంలో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల ధ్వంసం కేసును సీరియస్ గా తీసుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు… ఆ షో నిర్వాహకులకు నోటీసులు జారీ చేసారు. ఫైనల్స్ సందర్భంగా పెద్ద ఎత్తున అభిమాననులు తరలివస్తారని తెలిసి పోలీసులకు ముందస్తుగా ఎందుకు సమాచారం ఇవ్వలేదని వారు నోటీసుల ద్వారా షో నిర్వాహకులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి బిగ్ బాస్ సీజన్-7(Big Boss – 7) విన్నర్ పల్లవి ప్రశాంత్ తో పాటు మరో 24 మందిని అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు… తాజాగా నిర్వాహకులకు నోటీసులు జారీ చేసారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

Big Boss Telugu Management Got Notices

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ ఫినాలే‌లో పల్లవి ప్రశాంత్ విన్నర్‌గా నిలిచి ట్రోఫీని అందుకున్నాడు. ఆ షో ముగిసిన అనంతరం బిగ్ బాస్ హౌస్ బయట తన అభిమానులతో కలిసి ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రశాంత్ అభిమానులు, ఇతర కంటెస్టెంట్ల అభిమానుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ప్రశాంత్ అభిమానులు అక్కడ విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనలో ఆరు ప్రభుత్వ బస్సులతో పాటు ఒక పోలీసు వాహనం కూడా ధ్వంసం అయ్యాయి. దీనితో ఈ దాడి ఘటనను సుమోటోగా తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరుడు మహావీర్ పై వివిధ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసారు. ఈ కేసులో ఎ-1గా పల్లవి ప్రశాంత్‌ను చేర్చగా, ఎ-2గా అతడి సోదరుడు మనోహర్‌, ఎ-3గా అతడి స్నేహితుడు వినయ్‌ను చేర్చి రిమాండ్ కు తరలించగా… నాంపల్లి కోర్టు రెండు రోజుల క్రితం వారికి షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.

Also Read : Ananya Pandey: లాయర్ కాబోతున్న అనన్యపాండే !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com