Big Boss Sohel: బిగ్‌బాస్ రియాల్టీ షోతో గుర్తింపు తెచ్చుకున్న సోహైల్… హీరోగా నటించిన సినిమా ‘బూట్‌కట్ బాలరాజు’. శ్రీ కోనేటి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో మేఘలేఖ హీరోయిన్ గా నటించగా… సునీల్, ఇంద్రజ, అవినాష్ కీలక పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమాకు సోహైల్(Sohel) ఊహించిన స్థాయిలో స్పందన రాలేదు. దీనితో మనోవేదకు గురయిన సోహైల్… ఫ్యామిలీ సినిమాలు చేయమంటారు.. మరి చేస్తే చూడరెందుకు ? అని ప్రేక్షకులను ప్రశ్నిస్తూ ఓ ఎమోషనల్ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ప్రస్తుతం సోహైల్ పోస్ట్ చేసిన ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
Big Boss Sohel Video Viral
‘‘ఇక నుండి నేను ఫ్యామిలీ సినిమాలు కాకుండా… ముద్దులు పెట్టే సినిమాలు చేస్తాను. ఎందుకంటే, ఫ్యామిలీతో చూసే సినిమాలు చేయమని అభిమానులు, ప్రేక్షకులు, నెటిజన్లు కామెంట్స్ పెడతారు. తీరా అలాంటి సినిమా చేస్తే మాత్రం థియేటర్ కు వెళ్ళి చూడరు. కుటుంబమంతా కలిసి చూసేలా ‘బూట్‌కట్ బాలరాజు’ సినిమా చేసాను. నా స్థోమత మేరకు ప్రమోషన్స్ చేశా. కంటెంట్ బాగున్నా… ప్రమోషన్స్ కు సరిపడా డబ్బు లేనప్పుడు నేనేం చేయాలి ? చూసిన వాళ్లందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ నా సినిమాకు వెళ్లండి’’ అంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది. అయితే దీనిపై నెటిజన్ల నుంచి దీనిపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కొందరు సోహైల్ ను సపోర్ట్ చేస్తుంటే… మరికొంతమంది మాత్రం కంటెంట్ ఉంటే ఎలాగైనా సినిమా హిట్ అవుతుందని… ప్రత్యేకంగా ఎమెషనల్ వీడియోలు పెట్టి ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదని కామెంట్లు పెడుతున్నారు.
Also Read: Sandeep Vanga: అమీర్ ఖాన్ మాజీ భార్యకు ‘యానిమల్’ డైరెక్టర్ స్ట్రాంగ్ వార్నింగ్ !