BIG BOSS Season 7 : తెలుగు బుల్లి తెరపై సంచలనం రేపిన బిగ్ బాస్ సీజన్ 7 కు రెడీ అయ్యింది. ఇందుకు స్టార్ మా తెలుగు సిద్దమైంది. డ్రామా, నాన్ స్టాప్ వినోదం ఉండేలా జాగ్రత్త పడ్డారు నిర్వాహకులు. ఇక ఎప్పటి లాగే నటనలో కింగ్ మేకర్ గా పేరు పొందిన అక్కినేని నాగార్జున(Nagarjuna) మరోసారి హోస్ట్ చేయబోతున్నారు.
BIG BOSS Season 7 Will Coming Soon
బిగ్ బాస్ సీజన్ 7 కు సంబంధించి ఇవాళ రాత్రి 7 గంటలకు గ్రాండ్ లాంచ్ జరగనుంది. బిగ్ బాస్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. గతంలో బిగ్ బాస్ కోసం నటులు ప్రయత్నించినా చివరకు కింగ్ నాగార్జున మాత్రమే హైలెట్ గా మారారు. ఆయన షోను నిర్వహిస్తున్న తీరు ప్రేక్షకులను కట్టి పడేసేలా చేస్తోంది.
ఇదిలా ఉండగా బిగ్ బాస్ షో ప్రతి సోమవారం నుండి శుక్రవారం రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానుంది. ఇక వారాంతంలో రాత్రి 9 గంటలకు టెలికాస్ట్ కానుంది. ఈ రియాల్టీ షోకు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది.
షోస్ కు సంబంధించిన రేటింగ్స్ లలో బిగ్ బాస్ తెలుగు దుమ్ము రేపుతూ దూసుకు పోతోంది. ఈ తరుణంలో తాజాగా బిగ్ బాస్ -7 సీజన్ లో ఎవరు ఉండ బోతున్నారనేది ఇంకా రివీల్ చేయలేదు. కింగ్ నాగార్జున ఈసారి ఏం చేస్తున్నారనేది వేచి చూడాలి.
Also Read : Simran Choudhary Vs Mirna Menon