Big Boss Prasanth: రైతుబిడ్డగా బిగ్‌బాస్ సీజన్ 7లో అడుగుపెట్టి… విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ అనూహ్యంగా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో ఇరుక్కుని చంచల్ గూడ జైల్ లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కొంతమంది అభిమానుల అత్యుత్సాహంతో అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన గలాటాలో ప్రశాంత్ ను అరెస్ట్ చేయడంపై ఆయన తండ్రి సత్యనారాయణ కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఒక రైతు బిడ్డగా బిగ్ బాస్(Big Boss) రియాలిటీ షోలో అడుగుపెట్టి విజేతగా బయటకు వచ్చిన తన కుమారుడు పల్లవి ప్రశాంత్ ను చూసి గర్వపడిన కొన్ని క్షణాల్లోనే తమ ఆనందాన్ని ఆవిరి చేసారని పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. తమ కుమారుల అరెస్టుతో తన భార్య అనారోగ్యం బారిన పడి… ఏడుస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Big Boss Prasanth Case Viral
తన కుమారులు పల్లవి ప్రశాంత్, మహావీర్ లను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడపై ప్రశాంత్ తండ్రి సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘నా కొడుకు బిగ్‌బాస్(Big Boss) గెలిచిండని మురిసిపోయినా. ట్రోఫీ గెలిచిన ఐదు గంటలకే నాకు బాధగా అనిపించింది. మాకు ఇదంతా ఎందుకు? వ్యవసాయం చేసుకుంటే సరిపోయేదనిపించింది. మా ఊర్లో ఉంటేనే బాగుండు. లేని పోనివీ సృష్టించి వార్తలు రాస్తున్రు. ప్రశాంత్ పక్కనే నేను కూడా ఉన్నా. నాకు వాంతులు కూడా అయ్యాయి. ఈ గొడవతో నా కొడుకుకు ఎలాంటి సంబంధం లేదు. అదే సెలబ్రిటీలు అయితే ఇలానే చేస్తారా?. మావాడు ఎక్కడికి పోలే. కానీ కొందరు కావాలనే పారిపోయిండని రాసిన్రు.’అని వాపోయారు.
పోలీసులు తీరుపై సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘బుధవారం సాయంత్రం 6.30కు పోలీసులు వచ్చి ప్రశాంత్‌ను తీసుకెళ్లారు. మాది మారుమూల గ్రామం. బెయిల్ ఇలాంటి వన్నీ నాకు తెల్వదు. నా భార్యకు ఆరోగ్యం బాగాలేదు. ఆమె ఏడుస్తూ కూర్చుంది. జ్వరం కూడా వచ్చింది. మమ్మల్ని లేని పోనీ ఇబ్బందులు, బాధలు పెట్టిండ్రు సార్. పరేషాన్ చేసిర్రు. బట్టలు మార్చుకుంటానంటే కూడా వినలేదు. ముందుగా మంచిగానే మాట్లాడిర్రు, ఒకాయన అయితే ప్రశాంత్ మెడల మీద చేతులపట్టి నూక్కొచ్చిర్రు. వారెంట్ కూడా ఇయ్యలేదు. దొంగతనం చేసినట్లు ప్రశాంత్‌ను తీసుకెళ్లారు. ప్రజలందరికీ నేను ఒక్కటే వేడుకుంటున్నా. నా కొడుకు దొంగ కాదు. బిగ్ బాస్‌కు పోతానంటే నేను పంపించినా. విన్నర్ అయినడు. కానీ ఆ సంతోషం మాకు లేకుండా పోయింది.’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : Suriya Jyothika: ముంబైకి మకాం మార్చిన జ్యోతిక… అసలు విషయం అదే…