Bhumi Pednekar: ‘దమ్ లగాకే హైస్సా’, ‘భక్షక్’ లాంటి చిత్రాలతో ఉత్తమ నటిగా నిరూపించుకున్న భూమి పెడ్నేకర్(Bhumi Pednekar) ను… వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) యంగ్ గ్లోబల్ లీడర్ గా ఎంపిక చేసింది. ‘క్లైమేట్ వారియర్ అండ్ భూమి ఫౌండేషన్’ ద్వారా పర్యావరణానికి చేస్తున్న విశేష సేవలకుగానూ యంగ్ గ్లోబల్ లీడర్‌గా ఆమెను ఎంపిక చేసినట్టు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తాజాగా ప్రకటించింది. రాజకీయాలు, వ్యాపారం, పౌర సమాజం, కళలు, విద్యాసంస్థలకు చెందిన కొందరి జాబితాను డబ్ల్యూఈఎఫ్ ప్రకటించింది. దీనితో భూమి 2025లో జరిగే ప్రఖ్యాత దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.
Bhumi Pednekar….
‘యంగ్ గ్లోబల్ లీడర్‌గా ఎంపికవడాన్ని ఒక గౌరవంగా భావిస్తున్నా. ఈ ఏడాది సింగపూర్ లో జరిగే సదస్సుతో పాటు వచ్చే ఏడాది దావోస్ సదస్సులోనూ పాల్గొంటాను. పర్యావరణ ప్రేమికురాలిగా, నటిగా ఆ ప్రపంచ వేదికపై నా వాణి బలంగా వినిపిస్తాను’ అంటూ సంతోషం వ్యక్తం చేసింది భూమి. ప్రస్తుతం ఈమె ‘మేరీ పత్నీ కా రీమేక్’లో నటిస్తోంది.
Also Read : Naga Chaitanya : లగ్జరీ కారు కొన్న యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య