Bhumi Pednekar : ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహించిన మేరే హస్బెండ్ కి బివీ చిత్రం ఈనెల 21న విడుదలైంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించారు. రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు భూమి పెడ్నేకర్(Bhumi Pednekar) నటించారు. ఇద్దరి మధ్య హీరో ఎవరికి చెందుతారనే దానిపై కామెడీ, రొమాంటిక్, థ్రిల్లర్ గా దీనిని రూపొందించాడు. ప్రస్తుతం విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
Bhumi Pednekar Comment
ఈ సందర్బంగా భూమి పెడ్నేకర్ చిట్ చాట్ చేసింది. సినిమా షూటింగ్ సమయంలో భూమి పెడ్నేకర్ కీలక వ్యాఖ్యలు చేసింది. దర్శకుడు అందించిన సహాయం గురించి మరిచి పోలేనని అన్నారు. నటనలో మరిన్ని మెళకువలను తెలుసుకున్నానని చెప్పింది.
మేరే హస్బెండ్ కి బివిలో తనకు అద్భుతమైన పాత్ర రావడం పట్ల సంతోషంగా ఉందన్నారు. ముదస్సర్ నజర్ ప్రధానంగా భాష విషయంలో కూడా టిప్స్ ఇచ్చారని తెలిపారు. నేను తప్పులు చెప్పినప్పుడల్లా సరిదిద్దాడని, దర్శకుడు చేసిన సహాయాన్ని తాను జీవితంలో మరిచి పోలేనని పేర్కొంది.
ఈ సినిమాలో ప్రబ్లీన్ అనే సాధారణ పంజాబీ మహిళ పాత్రను పోషించింది. భాషపై ముదస్సర్ అజీజ్ కు ఉన్న పట్టు ఈ చిత్రంలో పాత్రను మెరుగు పర్చడంలో సాయ పడిందని స్పష్టం చేసింది. గతంలో భూమి పెడ్నేకర్ దమ్ లగా కే హైషా అనే చిత్రంలో నటించింది. ఇందులో పోషించిన పాత్ర ప్రత్యేకించి మొండిదని పేర్కొంది. సినిమాను ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు నటి.
Also Read : Prudhvi Raj Shocking Comment :గొంతు విప్పుతా తాడో పేడో తేల్చుకుంటా