Bhale Unnade: రాజ్ తరుణ్ ‘భలే ఉన్నాడే’ ట్రైలర్ రిలీజ్ !

రాజ్ తరుణ్ 'భలే ఉన్నాడే' ట్రైలర్ రిలీజ్ !

Hello Telugu - Bhale Unnade

Bhale Unnade: మాజీ ప్రియురాలు లావణ్యతో ఒకవైపు వివాదం నడుస్తున్నప్పటికీ… హీరో రాజ్ తరుణ్ తన సినిమాల్లో మాత్రం జోరు తగ్గించడంలేదు. నా సామి రంగ, పురుషోత్తముడు, తిరగబడరా సామి అనే మూడు సినిమాలతో ఈ ఏడాది ప్రేక్షకులను అలరించిన రాజ్ తరుణ్… ఈ మూడింటికి మించి తన మాజీ ప్రియురాలు లావణ్య వివాదంతో ఎక్కువగా వార్తల్లో నిలిచారు. ఈ సినిమాల ఫలితాలు, లావణ్య వివాదం కాసేపు ప్రక్కన పెడితే… మరో సినిమా ‘భలే ఉన్నాడే(Bhale Unnade)’తో వినాయక చవితికు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్, మారుతి ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 7న ‘భలే ఉన్నాడే’ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను సోమవారం రిలీజ్ చేశారు.

Bhale Unnade – ‘భలే ఉన్నాడే’ ట్రైలర్ ఎలా ఉందంటే ?

ఇక ‘భలే ఉన్నాడే’ ట్రైలర్ విషయానికి వస్తే… అమ్మాయిలంటే ఆమడ దూరంలో వుండే హీరో పాత్రని హిలేరియస్ గా పరిచయం చేస్తూ మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. రాజ్ తరుణ్ , మనీషా కంద్కూర్ ల మధ్య వచ్చే సన్నివేశాలు, వారి లవ్ స్టొరీ చాలా ఎంటర్ టైనింగ్ గా వున్నాయి. ట్రైలర్ లో ఫన్ తో పాటు ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. టీవీ గణేష్, హైపర్ ఆది, కృష్ణ భగవాన్, శ్రీకాంత్ అయ్యంగార్ క్యారెక్టర్స్, వారి టైమింగ్ చూస్తుంటే సినిమాలో ఎంటర్టైమెంట్ అదిరిపోతుందని అర్ధమౌతోంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

Also Read : Narne Nithin: ‘ఆయ్’ సక్సెస్‌ తో దసరా బరిలోకి ఎన్టీఆర్ బావమరిది !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com