Bhagyashri Borse : టాలీవుడ్లో హీరోయిన్ల కొరత అనేది ఇప్పుడు కాదు.. ఎప్పట్నుంచో ఉంది. ఎంతోమంది కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీకి వస్తున్నారు కానీ ఆ సమస్య మాత్రం అలాగే కంటిన్యూ అవుతూనే ఉంది. మధ్యలో కొందరు బ్యూటీస్ కొన్ని రోజుల వరకు ఆ లోటు తీర్చినట్లు కనిపిస్తుంటారు కానీ అది మాత్రం అలాగే ఉండే నెవర్ ఎండింగ్ ఇష్యూగా మారిపోతుంది. త్రిష, అనుష్క, నయనతార లాంటి సీనియర్స్ తర్వాత.. కాజల్, రకుల్, సమంత లాంటి వాళ్లు 5-10 ఏళ్ళ వరకు హీరోయిన్స్ లేని కొరతను తీర్చేసారు. కానీ ఇప్పుడొస్తున్న హీరోయిన్లకు అంత స్టామినా ఉండట్లేదు. పట్టుమని అరడజన్ సినిమాలు చేయగానే కనీసం మ్యాప్‌లో కూడా కనిపించకుండా పోతున్నారు. ఆ మధ్య ఉప్పెన తర్వాత కృతి శెట్టి అలాగే వచ్చింది.. ఆ తర్వాత శ్రీలీల గురించి చెప్పనక్కర్లేదు.
Bhagyashri Borse..
రెండేళ్ల పాటు ఏ సినిమాలో చూసినా ఈమెనే కనిపించింది. ఓ టైమ్‌లో 10 సినిమాలు చేసింది శ్రీలీల. ఏ సినిమా షూటింగ్‌కు ఎప్పుడు వెళ్తుందో కూడా తెలియనంత బిజీ అయిపోయింది. కానీ గుంటూరు కారం తర్వాత శ్రీలీల కూడా డల్ అయిపోయింది. ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse) వైపు చూస్తున్నారంతా. మిస్టర్ బచ్చన్ సినిమాతో ఈ భామ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. మొదటి సినిమా విడుదల కాకముందే అమ్మడి గురించి అంతా ఆరా తీస్తున్నారు. కచ్చితంగా రేపు సినిమా కానీ హిట్ అయిందంటే మాత్రం.. భాగ్యశ్రీ కెరీర్ భాగ్యరేఖ మారిపోవడం పక్కా. ఆగస్ట్ 15న మిస్టర్ బచ్చన్ విడుదల కానుంది.
Also Read : Keerthy Suresh : తనపై వస్తున్న ట్రోలింగ్స్ కి కాలమే సమాధానం చెప్తుందంటున్న మహానటి