మినిమం గ్యారెంటీ ఉన్న దర్శకుడిగా పేరు పొందారు అనిల్ రావి పూడి. తను పటాస్ తీశాడు. ఆ తర్వాత ఎఫ్ 2 తో కామెడీ పండించాడు. ప్రిన్స్ తో సరిలేరు నీకెవ్వరు అంటూ వసూళ్ల సునామీ సృష్టించాడు. తాజాగా నట సింహం నందమూరి బాలకృష్ణ, శ్రీలీల, కాజల్ అగర్వాల్ తో కలిపి భగవంత్ కేసరి తీశాడు. ఇది ఊహించని దానికన్నా ఎక్కువగా కలెక్షన్లు వచ్చాయి. ఓ వైపు ఈ చిత్రానికి పోటీగా రెండు సినిమాలు వచ్చాయి. అయినా బాలయ్య మూవీ దూసుకు పోతోంది.
మేకింగ్, టేకింగ్ లో తనదైన ముద్ర కనబర్చడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పటికే ఈ చిత్రం 85 కోట్లను వసూలు చేసింది. ప్రస్తుతం రూ. 100 కోట్ల వైపు దూసుకు పోతోంది. సందేశంతో పాటు సున్నితమైన బంధాలకు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చాడు రావిపూడి.
ఇక ఎప్పటి లాగే బాలయ్య బాబు ఇరగదీశాడు. తనకు ఎదురే లేదని చాటాడు. తాజాగా దర్శకుడు కీలక అప్ డేట్ ఇచ్చాడు. భగవంత్ కేసరి మూవీకి సంబంధించి అదనంగా కొత్త పాటను చేర్చుతున్నట్లు స్పష్టం చేశాడు. అయితే ఈ పాటను అద్భుతంగా తెరకెక్కించాడని కితాబు ఇచ్చాడు నందమూరి బాలకృష్ణ. మొత్తంగా అనిల్ రావిపూడికి తన కెరీర్ లో ఇది మరిచి పోలేని సినిమా అవుతుందని ఇప్పటికే చెప్పేశాడు.