టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ ఉన్న దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది ముందుగా గుర్తుకు వచ్చే పేరు అనిల్ రావి పూడి. తను కామెడీతో పాటు కథకు కూడా ప్రయారిటీ ఇస్తూ వచ్చాడు. ఆ మధ్యన తను వరుణ్ తేజ్, వెంకటేశ్ తో ఎఫ్ 2 తీశాడు. సీక్వెల్ గా ఎఫ్ 3 తీశాడు.
బిగ్ సక్సెస్. ఆ తర్వాత ప్రిన్స్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు తీశాడు. ఇందులో రష్మిక మందన్నా కీలక పాత్ర పోషించింది. ఇది కూడా బిగ్ హిట్. ఇక బాలయ్య బాబు అంటేనే రౌద్రానికి , సీరియస్ పాత్రలకు పెట్టింది పేరు.
పూర్తిగా నవ్వుని ప్రొజెక్టు చేసే అనిల్ రావిపూడి ఉన్నట్టుండి నందమూరి బాలకృష్ణతో మూవీ తీయడం ప్రతి ఒక్కరినీ విస్తు పోయేలా చేసింది. ఈ సినిమాలో బాలకృష్ణతో పాటు శ్రీలీల, కాజల్ అగర్వాల్ నటించారు. ఇందులో తండ్రి పాత్రలో బాలయ్య, కూతురుగా శ్రీలీల నటించడం విశేషం.
అక్టోబర్ 19న తళపతి విజయ్ నటించిన లియో, మాస్ మహరాజా నటించిన టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలతో పాటు బాలయ్య భగవంత్ కేసరి కూడా విడుదలైంది.
ముందు నుంచీ పోటీ ఉన్నప్పటికీ మూవీకి మంచి ఆదరణ లభిస్తుండడంతో మూవీ మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజే ఏకంగా రూ. 32 కోట్లకు పైగా వసూలు చేసింది భగవంత్ కేసరి.