టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి. మనోడి టైమింగ్ , డైరెక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది. తను కళ్యాణ్ రామ్ తో పటాస్ తీశాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాలు తీసినా ఇంత వయొలెంట్ గా తీయలేదు. ఎఫ్2, ఎఫ్3 మూవీస్ భారీ కలెక్షన్స్ సాధించాయి. తను ప్రిన్స్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు తీశాడు. ఇది కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
అనంతరం నట సింహం బాలయ్య బాబు, శ్రీలీల తో కలిసి తీసిన భగవంత్ కేసరి అక్టోబర్ 19న రిలీజ్ చేశాడు. ప్రస్తుతం బాలయ్య కంటిన్యూగా సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం ఈ మూవీ ఆశించిన దానికంటే ఎక్కువగా కలెక్షన్స్ తో దూసుకు పోతోంది.
ఇక రెగ్యులర్ గా వినోదం, కమర్షియల్ మూవీ కాకుండా ఈసారి రూట్ మార్చేశాడు. తన రూట్ సపరేట్ అంటూ చెప్పకనే చెప్పాడు. ఇప్పటి వరకు బాలయ్యను ఒక రేంజ్ లో తీసిన ఘనత బోయపాటి శ్రీనుకు దక్కుతుంది. ఇక ఆ స్థాయిలో కంటే ఎక్కువగా నట సింహంలోని నటనను తెరపై ప్రత్యక్షం అయ్యేలా చేశాడు దర్శకుడు.
తాజాగా ఈ సినిమా రికార్డు కలెక్షన్స్ సాధించింది. ఏకంగా హాఫ్ సెంచరీ దాటింది. రూ. 100 కోట్ల వైపు దూసుకు పోతోంది.