టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ ఉన్న దర్శకుడిగా గుర్తింపు పొందారు అనిల్ రావిపూడి. నందమూరి కళ్యాణ్ రామ్ తో పటాస్ తీశాడు. ఆ తర్వాత వినోద ప్రధానమైన కథలను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 మూవీస్ భారీ ఎత్తున ఆదరణ చూరగొన్నాయి.
ఇదే దర్శకుడు ప్రిన్స్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు అంటూ సినిమా తీశాడు. ఇది కూడా బిగ్ సక్సెస్. సో కంటిన్యూ గా సినిమాలు విజయవంతం కావడంతో అనిల్ రావిపూడి గ్రాఫ్ పెరిగింది. ఇదే సమయంలో తొలిసారిగా తన కెరీర్ లో దమ్మున్న నట సింహం నందమూరి బాలయ్య బాబుతో తీశాడు భగవంత్ కేసరి.
ఈ సినిమాకు ఇతర సినిమాల నుండి పోటీ ఎదురైనా సరే వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. అక్టోబర్ 19న బాలయ్య సినిమాతో పాటు తమిళ సినీ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన లియో , మాస్ మహరాజా రవి తేజ నటించిన టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలు కూడా విడుదలయ్యాయి.
ఓ వైపు సినిమా రిలీజై డివైడ్ టాక్ తెచ్చుకుంది లియో మూవీ. ఏకంగా రికార్డుల మోత మోగిస్తోంది. ఒక్క తమిళనాడులోనే రూ.150 కోట్లు వసూలు చేసింది. ఇక ఓవరాల్ గా భగవంత్ కేసరి రూ. 100 కోట్లకు చేరుకుంది. దీంతో మూవీ మేకర్స్ , నటీ నటులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కొత్తగా అదనపు పాట చేర్చారు.