Keerthy : వెండి తెరపై తళుక్కున మెరిసింది కీర్తి సురేష్(Keerthy). తను మహేష్ బాబుతో నటించిన సర్కారు వారి పాట సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. చివరగా బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తో కలిసి బేబీ జాన్ మూవీలో నటించింది. ఇదే సమయంలో కెరీర్ లో సూపర్ స్టేజ్ లో ఉన్న సమయంలో ఎవరూ ఊహించని రీతిలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ బిగ్ షాక్ ఇచ్చింది. ఆంటోని థటిల్ ను పెళ్లి చేసుకుంది. ఇందుకు సంబంధించి తనే ఫోటోలను షేర్ చేసింది.
Keerthy Suresh-Thatill..
ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది. ఈ నూతన జంట ఫుల్ ఎంజాయ్ మూడ్ లో ఉంది. ఇద్దరూ కలిసి బ్యూటిఫుల్ టూరిస్ట్ స్పాట్ గోవాలో సందడి చేస్తున్నారు. వీరిద్దరి ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. చూడ ముచ్చటైన జంట అంటూ నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు కలకాలం చల్లంగా ఉండాలని కోరుతున్నారు.
తను జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా గుర్తింపు పొందారు. చిన్న వయసులోనే పేరు పొందడం విశేషం. ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో దివంగత సినీ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కించిన మహానటి మూవీలో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది కీర్తి సురేష్. ఆ తర్వాత భిన్నమైన పాత్రలలో నటించింది. మెప్పించేందుకు ప్రయత్నం చేసింది. ప్రస్తుతం థటిల్ తో తన ఆలోచనలను పంచుకుంటోంది.
Also Read : Kiccha Sudeep Reject : ప్రభుత్వ అవార్డును తిరస్కరించిన సుదీప్