Allu Arjun : సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం (ఆగస్టు 16) ప్రకటించింది. గతేడాది ఆరు జాతీయ అవార్డులు అందుకున్న తెలుగ ఇండస్ట్రీ ఈసారి మాత్రం కేవలం ఒక్క అవార్డుతోనే సరిపెట్టుకుంది. అయితే ఈసారి పురస్కారాల్లో దక్షిణాది సినిమాల ఆధిపత్యం కనిపించింది. మలయాళ, తమిళ్, కన్నడ సినిమాలకు అవార్డులు క్యూ కట్టాయి. కాంతార సినిమాకు గానూ జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. అలాగే తిరు సినిమాకు గానూ నిత్యా మేనన్ జాతీయ ఉత్తమ నటిగా నిలిచింది. ఇక అవార్డులకు ఎంపికైన వారికి అభినందనలు, ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు జాతీయ అవార్డు విజేతలను అభినందిస్తున్నారు. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నేషనల్ అవార్డ్ విన్నర్స్ అభినందనలు తెలిపాడు. కాగా 2021కు సంవత్సారానికి గానూ అల్లు అర్జున్ ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు గెలుచుకున్నాడు. పుష్ప సినిమాలో బన్నీ నటనకు గానూ ఈ అవార్డు వరించింది.
Hero Allu Arjun Appreciates
‘జాతీయ అవార్డు విజేతలందరికీ నా హృదయ పూర్వక అభినందనలు. రిషబ్ శెట్టి ఉత్తమ నటుడు అవార్డుకు అన్ని విధాలా అర్హుడు. అలాగే నా చిరకాల స్నేహితురాలు నిత్యా మేనన్ ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. జాతీయ అవార్డులు గెలుపొందిన అందరికీ నా శుభాకాంక్షలు. నిఖిల్, చందు మొండేటిలకు ప్రత్యేక అభినందనలు. ‘ కార్తికేయ2’ సినిమా విజయం సాధించినందుకు ఆ మూవీ యూనిట్అందరికీ శుభాకాంక్షలు’ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ పోస్ట్ కు కాంతారా హీరో రిషబ్ శెట్టి కూడా వెంటనే స్పందించాడు. ‘ థాంక్యూ బ్రదర్’ అని రిప్తై ఇచ్చాడు.
Also Read : Dil Raju : ఆడియన్సును మేమె చెడగొట్టాం అంటున్న నిర్మాత