Bellamkonda Sreenivas : బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు శ్రీను’ సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పదేళ్ల కెరీర్‌లో తొమ్మిది సినిమాలు చేశాడు. ప్రస్తుతం తన 10వ చిత్రానికి సిద్ధమవుతున్నాడు. ఆయన నటిస్తున్న చిత్రాన్ని మూన్ షైన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాతో సుధీర్ బీడి దర్శకుడిగా పరిచయం కానున్నాడు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే పుకార్లు వచ్చాయి. ఈ చిత్రంలో కథానాయికగా మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్ ఎంపికైనట్లు సమాచారం. 50 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. బెల్లంకొండ శ్రీను బాగా ఎంజాయ్ చేసిన కథ ఇది. ఏడాది కాలంగా కథకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూన్‌లో సినిమాను అధికారికంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Bellamkonda Sreenivas Movies
ఇదొక సైన్స్ ఫిక్షన్ సోషల్ ఫాంటసీ థ్రిల్లర్. ఈ జానర్ భారతదేశం అంతటా పాపులర్ అవుతుందనే నమ్మకంతో మేకర్స్ రూ.50 కోట్లు పెట్టుబడి పెట్టదానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. ఈ వర్క్‌లో కొన్ని ఊహించని కాంబినేషన్‌లు తెరపైకి రానున్నాయని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Also Read : Jr NTR : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో కొత్త ప్రాజెక్ట్