ఈ మధ్యన కంటెంట్ ఉన్న సినిమాలకు ఆదరణ పెరుగుతోంది తెలుగు సినీ రంగానికి సంబంధించి . ఇక తమిళ సినీ రంగంలో అత్యధికంగా తమను తాము ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డారు. భారీ సక్సెస్ సాధించేలా కథలు తయారు చేసే పనిలో పడ్డారు.
ప్రత్యేకించి తాజాగా విడుదలైన బెదురులంక 2012 చిత్రం పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమాకు క్లాక్స్ దర్శకత్వం వహించాడు. హాస్య, నాటక చిత్రంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. లౌక్య ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించారు.
ఇందులో నేహా శెట్టి, కార్తికేయ గుమ్మకొండ , అజయ్ ఘోష్ , శ్రీకాంత్ అయ్యంగార్ , ఎల్ బీ శ్రీరామ్ కీలక పాత్రల్లో నటించారు. బెదురు లంక 2012 చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు లో విడుదల చేశారు. రూ. 12 కోట్ల ఖర్చుతో దీనిని తీశారు. మూవీకి ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందించారు.
ఇంటిల్లి పాది చూసేలా ఈ చిత్రాన్ని తీసే ప్రయత్నం చేశారు దర్శకుడు క్లాక్. మొత్తంగా సినిమాను ఆకట్టుకునేలా తీయడంలో సక్సెస్ అయ్యాడని చెప్పక తప్పదు.